తెలంగాణ

telangana

Pembarthy artifacts in Yadadri Temple : యాదాద్రి ఆలయానికి పెంబర్తి కళాకృతులు

By

Published : Oct 18, 2021, 11:20 AM IST

Pembarthy artifacts in Yadadri Temple
Pembarthy artifacts in Yadadri Temple

హస్తకళలకు నిలయమైన పెంబర్తిలో.. హస్త కళాకారులు యాదాద్రి ఆలయ పనుల్లో తలమునకలయ్యారు. త్వరలో ఆలయ ఉద్ఘాటన మహోత్సవం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో ఆలయానికి వైవిధ్యమైన నగిశీలతో తొడుగులు(Pembarthy artifacts in Yadadri Temple) రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ ‘స్ఫూర్తి’ పథకం కింద ఆధునిక పరికరాలను రాయితీపై అందజేసింది. సరికొత్త యంత్రాలతో కళాకారులు వినూత్న కళాకృతులకు ప్రాణం పోస్తున్నారు.

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే ఆలయ ఉద్ఘాటన పర్వం ఉంటుందని యాడా అధికారులు చెబుతున్నారు. విభిన్న శిల్పకళలు, కృష్ణశిలలు, వినూత్న కళాకృతులతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయంలోని ద్వారాలు, ధ్వజస్తంభాలు, గడపలు, ఇతర నిర్మాణాలు కాంతులీనేందుకు జనగామ జిల్లా పెంబర్తి హస్తకళాకారులు.. కాంస్య, రజత తొడుగులు(Pembarthy ​artifacts in Yadadri Temple) రూపొందిస్తున్నారు.

రూ.1.20 కోట్ల ఆర్డర్..

ఎంఎస్​ఎంఈ స్ఫూర్తి పథకం కింద ఆధునిక పరికరాలను ప్రభుత్వం రాయితీపై అందజేయడంతో.. ఆ కొత్త యంత్రాలపై సరికొత్త డిజైన్లతో తొడుగులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.1.20 కోట్ల ఆర్డర్ ఇవ్వగా.. 2200 కిలోల ఇత్తడి, 850 కిలోల వెండితో ఆలయానికి 6 పంచతల ద్వారాలు, 1 సప్తతల ద్వారం, 106 కిలోల ద్వితల రజత ద్వారంతోపాటు, ధ్వజ స్తంభాలు, మకర తోరణాలను పెంబర్తి హస్తకళాకారులు రూపొందిస్తున్నారు. వీరు తొలుత రూపొందించిన పాత నమూనా డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త రీతిలో.. వినూత్న డిజైన్ల(Pembarthy ​artifacts in Yadadri Temple)తో తయారు చేయాలని కోరడం వల్ల కళాకారులు ఆ ఆకృతులకు ప్రాణం పోస్తున్నారు.

హై ఎంబోజింగ్​ విధానంలో..

గతంలో లైట్‌ ఎంబోజింగ్‌ విధానంలో కళాకృతులు(Pembarthy ​artifacts in Yadadri Temple) రూపొందించగా ఇప్పుడు హై ఎంబోజింగ్‌లో హంసలు, లతలు, చిలుకల లాంటి వాటితోపాటు కనువిందు చేసే అనేక డిజైన్లను 45 మంది కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘స్ఫూర్తి’ ద్వారా అందించిన అనేక రకాల యంత్రాలు ఇటీవలే పెంబర్తికి వచ్చాయి. పవర్‌ బెండింగ్, పవర్‌ పంచింగ్, పవర్‌ డైతో పాటు మొత్తం రూ. 1.80 కోట్ల విలువైన 25 రకాల ఆధునిక యంత్రాలను 80 శాతం రాయితీతో కేంద్రం అందించింది. ఈ యంత్రాలతో పని పదింతలు వేగం పుంజుకుంది. మరో నెల రోజుల్లో తమకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసేందుకు కళాకారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.

"మాకు ఒక 10 ద్వారాలు ఇచ్చారు. ఇంతకు ముందు చేశాం. కానీ సీఎం కేసీఆర్​కు నచ్చలేదని.. మళ్లీ కొత్తగా చేయమన్నారు. ఈసారి సరికొత్త డిజైన్లతో రూపొందిస్తున్నాం. దాదాపు రెండు నెలల వరకు సమయం పడుతుంది. ఈ ద్వారాలు కేసీఆర్​కు తప్పక నచ్చుతాయి."

- కళాకారుడు

"యాదాద్రి ఆలయ పనులు చేస్తున్నాం. ఇత్తడి, వెండి పనులు ఆర్డర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇత్తడి పనులు చేస్తున్నాం. దాదాపు పూర్తయింది. మిగతా పనులు చేయడానికి రెండు నెలలు పడుతుంది. ఆనంద్​ సాయి ఇచ్చిన డిజైన్ల ఆధారంగా రూపొందిస్తున్నాం. మా పనికి మంచి పేరు వస్తుంది అని ఆశిస్తున్నాం. ఈ పని చూసి భవిష్యత్​లో మరెన్నో ఆర్డర్లు రావాలని అనుకుంటున్నాం."

- రంగు నర్సింహాచారి, విశ్వకర్మ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్

చేతినిండా పని..

ఇన్నేళ్లు సరైన ఆర్డర్లు లేక కొట్టుమిట్టాడుతున్న పెంబర్తి హస్త కళాకారులకు యాదాద్రి పనుల(Pembarthy ​artifacts in Yadadri Temple) వల్ల చేతినిండా పని లభిస్తోంది. త్వరలో ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మరిన్ని ఆర్డర్లు రానున్నాయని కళాకారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details