ETV Bharat / state

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - నేటి నుంచి మెట్రో రైలు వేళ‌లు పొడిగింపు - Hyderabad Metro Timings Extended

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 10:34 PM IST

Hyderabad Metro Extended Timings : హైదరాబాద్​ మెట్రో జర్నీ చేసే వారికి అదిరే గుడ్​న్యూస్. మెట్రో రైలు పనివేళల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చి, అదనపు ప్రయాణ సమయాన్ని పొడిగించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణ టైమింగ్స్​ కంటే భిన్నంగా, పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం జర్నీ వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం.

Hyderabad Metro Rail Service
Hyderabad Metro Extended Timings (ETV Bharat)

Hyderabad Metro Timings Extended : హైదరాబాద్ మెట్రో సర్వీసులు ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా, ఇంకాస్త ఎక్కువ సేపు అందుబాటులో ఉండనున్నాయి. ఇవాల్టి నుంచి మెట్రో సర్వీసులు అదనపు గంటల్లో పనిచేయనున్నాయి. అందుకు అనుగుణంగా మెట్రో రైలు వేళల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి 11.45 గంటలకు టెర్మినల్​ స్టేషన్​ నుంచి అందుబాటులో ఉండనుంది.

అదేవిధంగా ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పొడిగించిన మెట్రో వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. దీనివల్ల ప్యాసింజర్లకు ఊరట లభిస్తుంని చెప్పుకోవచ్చు.

ప్రజారవాణా వ్యవస్థలో మెట్రోరైలు ప్రాజెక్టు చారిత్రాత్మకం : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి - Metro MD On Metro Rail New Record

హైదరాబాద్​ మెట్రో మరో మైలురాయి - ఆరున్నరేళ్లలో 50 కోట్ల ప్రయాణికులు - Hyderabad Metro 50 crore passengers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.