తెలంగాణ

telangana

81 ఏళ్ల వయస్సులో అలుపెరగని సాహిత్యం

By

Published : Mar 5, 2021, 5:05 PM IST

వేదాలను తెలుగులో సులభంగా అర్థమయ్యేలా రచనలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు జగిత్యాలకు చెందిన సాహితివేత్త ఎంవీ నర్సింహరెడ్డి. 81వ సంవత్సరంలో కూడా అలుపెరగని సాహిత్యం చేస్తూ పాఠకుల మదిలో నిలుస్తున్నారు. సులభంగా పాఠకులకు అర్థమయ్యేలా చేసిన రచనలు ప్రత్యేకత చాటుకుంటున్నాయి.

literary-mv-narasimha-reddy-making-the-vedas-in-telugu-at-the-age-of-81
81 ఏళ్ల వయస్సులో అలుపెరగని సాహిత్యం

జగిత్యాల పట్టణానికి చెందిన ఎంవీ నర్సింహారెడ్డి... అధ్యాపకుడిగా, ఎంఈవోగా పనిచేస్తూ పలు రచనలు చేశారు. 81 ఏళ్ల వయసులోనూ ఆయన రచనలు కొనగించటం విశేషం. రుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వేదం అను నాలుగు వేదాలను తెలుగులో అనువాదం చేశారు.

ఇప్పటికీ పలు రచనలు చేస్తూ పాఠకుల మదిలో నిలుస్తున్నారు. 2015లో రవీంద్రభారతిలో సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ఉగాది పురస్కారాన్ని... పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ అనుమండ్ల భూమయ్య చేతుల మీదుగా హస్య రచనలో కీర్తి పురస్కారం అందుకున్నారు.

ఇదీ చూడండి:సీతారామచంద్రస్వామి తలంబ్రాలను నేలపాలు చేశారు..

ABOUT THE AUTHOR

...view details