తెలంగాణ

telangana

Fighting for Pension Money : తల్లి పెన్షన్​ డబ్బుల కోసం అన్నదమ్ముల గొడవ.. ఆపేందుకు వెళ్లి..!

By

Published : May 5, 2023, 10:34 PM IST

man died in a fight over pension money in jagtial district : తల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన కుమారులు.. ఆమెకు వచ్చే ఆసరా పెన్షన్ కోసం ఆశపడి పరస్పరం గొడవ పడుతున్నారు. ఇదంతా చూస్తున్న వారి బావ.. గొడవను ఆపడానికి వారి మధ్యలోకి వెళ్లాడు. దీంతో వారు ఒక్కసారిగా అతణ్ని నెట్టేయడంతో.. అక్కడున్న బండరాయికి తల తగిలి తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ దారుణం జగిత్యాల జిల్లా విజయపురి కాలనీలో చోటుచేసుకుంది.

death
death

man died in a fight over pension money in jagtial district: కన్నతల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన కుమారులు.. ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లి యోగక్షేమాలు చూడాల్సింది పోయి.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులకు ఆశపడ్డారు. ఆమెకు వచ్చే రూ.2 వేల ఆసరా పెన్షన్ కోసం గొడవకు దిగి కొట్లాడుకున్నారు. వీరిరువురి మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన వారి బావను తోసేయడంతో.. బండరాయి తగిలి గాయపడి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో చోటుచేసుకుంది.

విజయపురి కాలనీలో నివసించే హయాత్, తాజ్ ఇద్దరూ అన్నదమ్ములు. వారి తల్లికి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.రెండు వేల ఆసరా పెన్షన్​ వస్తోంది. ఆ పెన్షన్​ను తల్లి నుంచి అన్నదమ్ములు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పెన్షన్ డబ్బుల కోసం ఈ రోజు అన్నదమ్ములు కొట్లాడుకుంటుండగా బావ సయ్యద్ నయీమ్ గొడవను ఆపడానికి వారి మధ్యలోకి వెళ్లాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. అతణ్ని నెట్టడంతో కింద పడిపోయి బండరాయి తలకు తగిలి బలమైన గాయమై మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

"హయాత్​, తాజ్ తమ తల్లికి వచ్చే ఆసరా పెన్షన్ తీసుకోవడానికి పరస్పరం గొడవకు దిగారు. వారి బావైన సయ్యద్ నయీమ్.. గొడవను ఆపడానికి వారి మధ్యలోకి వెళ్లాడు. వారు ఒక్కసారిగా నయీమ్​ను బలంగా నెట్టేశారు. దీంతో నయీమ్ అక్కడున్న బండరాయికి తల తగిలి.. తీవ్రంగా గాయపడి మరణించాడు". ప్రత్యక్ష సాక్షి

చితి పేర్చుకుని.. వృద్ధుడి సజీవ దహనం..:సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది.వెంకటయ్య అనే 9ం ఏళ్ల వృద్ధుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం పొట్లపల్లిలో నివాసం ఉంటున్నారు. భార్య గతంలోనే తనువు చాలించింది. వీరి దాంపత్య జీవితంలో నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య, ఆరయ్య, ఓ కుమార్తె పుట్టారు. వీరందరూ ఒకే గ్రామంలో కాకుండా వేరువేరు గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరి దగ్గర వంతుల చొప్పున వెంకటయ్య ఉంటున్నాడు. వీరు తరచుగా వారి తండ్రిని సాకడానికి గొడవలు పడేవారు. గత కొంతకాలంగా పెద్దకొడుకు వద్ద ఉంటున్న వెంకటయ్య.. పెద్ద కొడుకు వంతు అయిపోవడంతో మరో కొడుకు వద్దకు వేరే గ్రామానికి వెళ్లాల్సి ఉంది. దీంతో మనస్తాపం చెందిన వెంకటయ్య.. కన్నఊరిని వదల్లేక, వారికి భారం కాలేక.. ఊరి చివర తాటికమ్మలతో చితి పేర్చుకుని తానకు తానుగా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details