ETV Bharat / state

A Family Needs Help : తాను నడవలేనని తెలుసు.. అయినా తన వారిని పోషించాలని

author img

By

Published : May 5, 2023, 1:52 PM IST

A Family Needs Help in Khammam: నేటి కాలంలో కనిపెంచిన తల్లిదండ్రులను పోషించేందుకు భారంగా భావిస్తున్న రోజులివి. కానీ ఓ దివ్యాంగ యువతి.. రోడ్డు ప్రమాదాల్లో చితికిపోయిన తన కుటుంబానికి అండంగా నిలుస్తోంది. అమ్మనాన్నలను సాకుతూ జీవన పోరాటం చేస్తోంది. తాను నడవలేకున్నా... తన వారిని పోషించాలనే తాపత్రయం ఆమెను ముందుకు నడిపిస్తోంది. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Khammam
Khammam

A Family Needs Help in Khammam: వారిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. ఉండడానికి నిలువ నీడలేదు. కానీ ఆ దంపతులు నలుగురు కుమార్తెలను కూలీనాలీ చేస్తూ పెంచారు. ఈ క్రమంలోనే వరస విషాదాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన ఆ భార్యభర్తలు మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఊత కర్రలే ఆసరాగా నడుస్తున్న పెద్ద కూతురే.. వారికి పెద్ద దిక్కుగా నిలిచింది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసినా ఆమె ఉపాధి లేక.. ఈ స్థితిలో ఉన్న అమ్మానాన్నలను వదలి ఎక్కడికీ వెళ్లలేక.. వారికి సపర్యలు చేస్తూ ఆ యువతి జీవితాన్ని గడుపుతోంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

మధిర మండలం మాటూరుపేటకు చెందిన గుంజి రాంబాబు, లక్ష్మి దంపతులకు నలుగురు కూమార్తెలు. భార్యభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. పెద్ద కూతురు అంజమ్మకు చిన్నతనంలోనే పోలియో సోకింది. దీంతో రెండు కాళ్లూ పనిచేయవు. ఈ నేపథ్యంలోనే డిగ్రీ వరకు ఎలాగో చదివిన ఆ యువతి ఊత కర్రల ఆధారంగా నడుస్తోంది. మరోవైపు చిన్న కుమార్తె మానసిక దివ్యాంగురాలు. ఆమె కొద్ది సంత్సరాల క్రితం మరణించింది. మరో ఇద్దరు కూతుళ్లకు వివాహాలు చేయగా కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు.

విధి చిన్నచూపు: ఈ క్రమంలోనే ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితాలను విధి చిన్నచూపు చూసింది. గత సంవత్సరం లారీ ఢీకొనడంతో రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఒక కాలు తొలగించారు. మరో కాలులో రాడ్లు వేశారు. దీనికితోడు పక్షవాతం రావడంతో ఆయన పూర్తిగా మంచానికే పరితమయ్యారు. కానీ ఇది జరిగిన కొద్ది నెలలకే మరో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. లక్ష్మి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఊత కర్ర లేనిదే అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడా తల్లిదండ్రుల భారమంతా పెద్ద కుమార్తె అంజమ్మపై పడింది. తండ్రి, కూతుళ్లకు వస్తున్న దివ్యాంగుల పింఛన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆ వచ్చే డబ్బులు ప్రతినెలా మందులకు కూడా సరిపోవడంలేదని వారు వాపోతున్నారు. మరోవైపు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న తనకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపాలని జిల్లా అధికారుల చుట్టూ అంజమ్మ ప్రదక్షిణలు చేస్తోంది. అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్న తమకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కేటాయించాలని ఆ కుటుంబం దీనంగా వేడుకుంటోంది.

ఇవీ చదవండి: తన 'బలగం'ను విడిచి వెళ్లలేక.. చితిలో దూకిన కన్నతండ్రి

'ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి.. నిధులిచ్చే వాటిని నిషేధించాల్సిందే!'.. భుట్టో సాక్షిగా భారత్‌ ఘాటు వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.