తెలంగాణ

telangana

ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారన్న మహిళా సంఘాలు

By

Published : Sep 3, 2020, 3:42 PM IST

రాష్ట్రంలో ప్రజలు ఉపాధి లేక అన్నమో రామచంద్ర అని బాధపడుతున్నారని మహిళా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అనుకున్నది కాలేదన్నారు. అనేకమంది జీవనోపాధికి లేక అల్లాడుతున్నారని చెప్పారు. ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై గృహహింస, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.

Women’s groups are suppressing those in question in telangana
ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారన్న మహిళా సంఘాలు

ప్రశ్నించిన వారిని అణచివేస్తున్నారన్న మహిళా సంఘాలు

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై గృహహింస, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాదని.. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న హింసపై భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వర్చువల్‌ రౌండ్ టెబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు చెందిన మహిళ నేతలు.. జ్యోతి, సజయ, మల్లేశ్వరి, దేవి, సృజనతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మహిళా సంఘాల నేతలు ఐక్యంగా పోరాడి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు రద్దు చేస్తున్నారని అన్నారు. మహిళల హక్కుల కోసం మరోసారి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న ఆత్యాచారాలు, హింసపై విసృతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


ఇదీ చూడండి :గుట్టలకు సైతం పట్టాలిస్తున్న రెవెన్యూ అధికారులు!

ABOUT THE AUTHOR

...view details