తెలంగాణ

telangana

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి

By

Published : Dec 21, 2022, 9:42 AM IST

Updated : Dec 21, 2022, 10:20 AM IST

TTD EO son passes away
TTD EO son passes away

06:08 December 21

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి

TTD EO son Chandramouli passed away: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మృతిని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

వచ్చే నెలలో వివాహం.. ఇంతలోనే ఇలా:చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, తితిదే చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details