తెలంగాణ

telangana

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో 19 మందిని సాక్ష్యులుగా నమోదు చేసిన సిట్

By

Published : Mar 24, 2023, 1:58 PM IST

TSPSC Paper Leak SIT Remand Report : టీఎస్​పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ఏర్పాటైన సిట్ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా లీకేజీ వ్యవహారంలో 19 మందిని సాక్ష్యులుగా నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన నీలేశ్​, గోపాల్ నాయక్​తో పాటు డాక్యా నాయక్​ బస చేసిన కర్మన్​ఘాట్​లోని ఆర్ స్క్పేర్ లాడ్జ్ యజమాని, ఇద్దరు సిబ్బంది నుంచి వాగ్మూలం నమోదు చేశారు.

tspsc
tspsc

TSPSC Paper Leak SIT Remand Report : టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు 19 మందిని సాక్ష్యులుగా చేర్చారు. టీఎస్​పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితో పాటు అదే కార్యాలయానికి చెందిన మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. వీళ్లలో ప్రవీణ్ వద్ద జూనియర్ అసిస్టెంట్​గా పని చేసిన అనురాజ్​తో పాటు.. టీఎస్​టీఎస్ తరఫున టీఎస్​పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి సహోద్యోగిగా పని చేస్తున్న హరీశ్​కుమార్​ను సాక్ష్యులుగా చేర్చారు.

కర్మన్​ఘాట్​లోని ఆర్ స్క్పేర్ లాడ్జ్ యజమాని, ఇద్దరు సిబ్బందిని సాక్ష్యులుగా చేర్చారు. ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ లాడ్జ్​లో నీలేశ్​, గోపాల్ నాయక్​తో పాటు డాక్యా నాయక్​ బస చేశారు. ప్రవీణ్ లీక్ చేసిన ప్రశ్నాపత్రం ఆధారంగా సమాధానాలు చదువుకొని.. 5వ తేదీన నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. లాడ్జిలో ఉన్న సీసీ దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా టీఎస్​పీఎస్సీ ఏఎస్​వో షమీమ్, రమేష్, సురేష్​లను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సిట్

ఈ ముగ్గురినీ వారం రోజుల కస్టడీ ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇప్పటి వరకు టీఎస్​పీఎస్సీకి చెందిన నలుగురు ఉద్యోగులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 13వ తేదీన ప్రవీణ్, రాజశేఖర్​ను అరెస్ట్ చేయగా.. షమీమ్, రమేష్​లను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఉదాసీనతే కొంప ముంచిదా..:టీఎస్‌పీఎస్సీ పరిపాలన విభాగానికి సెక్రటరీ అధిపతి. కమిషన్​లో పని చేస్తున్న ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు నిబంధనలకు లోబడి సక్రమంగా పని చేస్తున్నారా? అని చూడాల్సిన బాధ్యత సెక్రటరీదే. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంటే ప్రశ్నాపత్రాల తయారీ, నిల్వ చేయడం, మూల్యాంకనం మొదలగు రహస్య కార్యకలాపాలన్నీ కార్యదర్శి చేతిలోనే ఉంటాయి. టీఎస్‌పీఎస్సీలో పని చేసే ఉద్యోగులు కమిషన్‌ నిర్వహించే ఏ పరీక్ష రాయాలన్నా.. కార్యదర్శి నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతి పొందిన ఉద్యోగులను సెలవుపై పంపించాలి. లేదా పరీక్షల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్ల నుంచి వారిని దూరంగా పెట్టాలి.

ఈ విషయంలో ఉన్నతాధికారులు అలసత్వం ప్రదర్శించారు. గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన ఉద్యోగులపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రేయింబవళ్లు శ్రమించి సిద్ధమవుతుండగా.. కమీషన్ ఉద్యోగులు మాత్రం యథేచ్ఛగా ఉద్యోగం చేసుకుంటూ పరీక్ష రాశారు. శాశ్వత, పొరుగు సేవల ఉద్యోగులు మొత్తం 20 మంది పరీక్ష రాయగా, వీరిలో ఎనిమిది మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details