ETV Bharat / bharat

మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల అరెస్ట్.. వారిలో ఇద్దరికి గ్రూప్‌-1లో భారీగా మార్కులు

author img

By

Published : Mar 23, 2023, 4:50 PM IST

Updated : Mar 23, 2023, 10:10 PM IST

Nampally Court Remanded Three Accused In TSPSC Paper Leakage: గ్రూప్‌-1 పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులపై సిట్‌ ఆరా తీస్తోంది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను సిట్‌ అధికారులు తెలుసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లో మరో ఇద్దరికి గ్రూప్‌-1లో భారీగా మార్కులు వచ్చినట్లు సిట్‌ బృందం గుర్తించింది. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి వారిని 14రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇవాళ అరెస్టైన నిందితుల ఇళ్లలో సిట్‌ బృందం సోదాలు నిర్వహించింది. ఎల్బీనగర్‌లోని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి షమీమ్‌ ఇంట్లో సోదాలు చేశారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ఇంకా ఏమైనా సమాచారం దొరుకుతుందోమోన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు.

TSPSC
TSPSC

Nampally Court Remanded Three Accused In TSPSC Paper Leakage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ బృందం కీలక విషయాలను రాబట్టే పనిలో పడింది. దీంతో ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తూ.. 6వరోజు ఆఖరి రోజు కావడంతో తన వేగాన్ని పెంచింది. అందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో గ్రూప్‌-1 పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను సిట్‌ ఆరా తీసింది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను సిట్‌ అధికారులు తెలుసుకున్నారు. అయితే టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని ఉద్యోగుల్లో మరో ఇద్దరికీ గ్రూప్‌-1లో భారీ మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్‌-1లో షమీమ్‌కు 127 మార్కులు రాగా.. రమేశ్‌కు 122 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీలో పొరుగు సేవల ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు ఇన్ని మార్కులు ఎలా వచ్చాయని అధికారులు తెలుసుకున్నారు. అందులో భాగంగా రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌లను అరెస్టు చేసి.. విచారించారు. విచారణలో సిట్‌ అధికారులకు కీలక విషయాలు లభించాయి. ఈ కేసులో నిందితునిగా ఉన్న షమీమ్‌ 2013లో గ్రూప్‌-2లో ఉద్యోగం పొందినట్లు సిట్‌ బృందం గుర్తించింది. రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రాన్ని తీసుకున్నట్లు విచారణలో తేలింది. రాజశేఖరే తన దగ్గర డబ్బులు తీసుకోకుండా ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినట్లు షమీమ్‌ విచారణలో తెలిపాడు.

పేపర్‌ లీకేజీ నిందితులకు 6 రోజుల గడువు పూర్తి కావడంతో మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. నిందితులుగా పేర్కొంటున్న రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌లను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ముగ్గురికి కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించింది. ఏప్రిల్‌ 6 వరకు వీరు రిమాండ్‌లో ఉంటారు. ఆ 9మంది నిందితుల కస్టడీ విచారణ ఇవాళ జరగకపోవడంతో.. 12 మంది నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పేపర్‌ లీకేజీలో వేగంగా సాగిన సిట్‌ దర్యాప్తు: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో కమిషన్‌లోని సభ్యుల పాత్రపై మొదటి నుంచి సిట్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా కాన్ఫిడెన్సియల్‌ అధికారిని శంకరలక్ష్మిని విచారించారు. ఆమె ఇచ్చిన సమాధానాలు ఆధారంగా నిందితులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో డొంక మొత్తం కదిలింది. టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని ఉద్యోగులు కూడా గ్రూప్‌-1 పరీక్ష రాసినట్లు గుర్తించి.. ఎవరెవరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అని విషయంపై సిట్‌ అధికారులు దర్యాప్తు చేశారు. ఇవాళ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో మళ్లీ నాంపల్లి కోర్టును సిట్‌ అధికారులు ఆశ్రయించారు. దీంతో మొత్తం 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 23, 2023, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.