తెలంగాణ

telangana

Telangana Cabinet Meeting 2023 : భారీ ఎజెండాతో రేపటి కేబినెట్​ భేటీ.. యుద్ధ ప్రాతిపదికన అధికారుల కసరత్తు

By

Published : Jul 30, 2023, 7:31 AM IST

Telangana Cabinet Meeting News : హైదరాబాద్‌లో మెట్రో రైల్ విస్తరణ, మామునూరు విమానాశ్రయం అభివృద్ధి, అనాథల కోసం ప్రత్యేక విధాన రూపకల్పన సహా పలు కీలక అంశాలు రేపటి మంత్రివర్గ సమావేశం ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారీ ఎజెండాతో రేపటి కేబినెట్ భేటీ జరగనున్నట్లు సమాచారం. అన్ని శాఖల అధికారులు సమావేశం కోసం యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నారు.

TS Ministers Cabinet Meeting
TS Ministers Cabinet Meeting

రేపే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Telangana Cabinet Meeting : భారీ అజెండాతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన.. రేపు మధ్యాహ్నంమంత్రివర్గం సమావేశం కానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రతిపాదనతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలు.. కేబినెట్ ముందుకు రానున్నాయి. కొత్తగా ఐదు కారిడార్ల విస్తరణ.. మెట్రో రెండో దశలో బీహెచ్​ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు విస్తరించే ప్రతిపాదన, ఓఆర్​ఆర్​ వెంట మెట్రో లైన్ ఏర్పాటు ప్రతిపాదనలున్నట్లు సమాచారం.

Cabinet meeting On Telangana Rains 2023 :మహబూబాబాద్ జిల్లాలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు, నిమ్స్ విస్తరణ వ్యయాన్ని 1571 నుంచి 1698 కోట్లకు పెంపు.. అందుకో సం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రుణానికి అనుమతి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు.. అక్కడ టెర్మినల్ బిల్డింగ్, రన్‌వే విస్తరణకి భూసేకరణ అంశం మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలిసింది. కొత్త గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాల్టీల ఏర్పాటు ప్రతిపాదనలు.. అనాథ చిన్నారుల కోసం విధానం రూపకల్పన అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. ఐదు వేల కోట్ల.. రుణం తీసుకునేందుకు ట్రాన్స్‌కోకి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చే అంశం ఉండవచ్చని తెలిసింది.

Telangana Assembly Elections 2023 :వీఆర్​ఏల క్రమబద్దీకరణ, సర్దుబాటుపైనా.. సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, గృహలక్ష్మీ.. బీసీ, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం, దళితబంధు సహా కీలకమైన పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ఆర్థిక పర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వపరంగా పూర్తి చేయాల్సిన పనులపైనా మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telangana Legislature Sessions2023 : గురువారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సమావేశాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు, విపక్షాలు ఎదుర్కోవడం, ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లుల ముసాయిదాపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

Telangana Cabinet Meeting On Crop Damage :గవర్నర్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. 2022 పురపాలక నిబంధనలు, డీఎమ్​ఈ పదవీ విరమణ వయస్సు పెంపు సహా.. పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. కొత్తగా తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లు, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుల ముసాయిదాపైమంత్రివర్గం చర్చించనుంది. ఆ బిల్లులను ఆమోదిస్తే గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రవేశపెడతారు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై విపత్తు నిర్వహణ శాఖ.. దెబ్బతిన్న రహదార్ల విషయమై రోడ్లు భవనాల శాఖ కసరత్తు చేస్తోంది. నష్టానికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేసి కేబినెట్‌కు వివరించనున్నారు. వాటితో పాటు పలు ఇతర అంశాలు మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details