TS Ministers Cabinet Meeting: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

author img

By

Published : May 18, 2023, 9:05 PM IST

Updated : May 18, 2023, 10:58 PM IST

cabinet

Ministers Cabinet Meeting In Telangana : కులవృత్తులకు చేయూత, యాసంగి పంటకాలం మార్పు మొదలగు అంశాల విధివిధానాల ఖరారుపై సబ్‌ కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో వీఆర్‌ఏల క్రమబద్దీకరణ, తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు, 111జీవో ఎత్తివేత మొదలగు వాటికి ఆమోదం తెలిపారు.

Ministers Cabinet Meeting In Telangana : నూతన సచివాలయంలోని మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తెలంగాణ విజయాలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు.. తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ రంగాల్లో సాధించిన తెలంగాణ విజయాలను నిర్వహించాలని కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

కులవృత్తులకు చేయూత..: కులవృత్తులను బలోపేతం చేసేందుకు, వారికి ఆర్థికంగా చేయూత అందిచేందుకు విధి విధానాలను రూపొందించాలని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా పథకం రూపకల్పన చేయాలని సీఎం సూచించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

జీవో ఎత్తివేత, కాళేశ్వరంతో అనుసంధానం : 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమల్లో ఉంటాయో, వారికి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. అలాగే 111 జీవో ప్రాంతంలో రహదారులను విస్తరించనున్నారు. కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాన్ని అనుసంధానానికి నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌తో గోదావరి జలాలను అనుసంధించాలని నిర్ణయించారు

డీఎంహెచ్‌ఓల భర్తీ..: రాష్ట్ర వ్యాప్తంగా 38 డీఎంహెచ్‌ఓ పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

యాసంగి పంట కాలంపై సబ్‌కమిటీ..: వ్యవసాయ రంగంలో పలు మార్పులు తెచ్చేందుకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. యాసంగి పంటను నెలరోజులు ముందుకు తెచ్చే అంశాన్ని సబ్‌ కమిటీ పరిశీలించనుంది. నకిలీ విత్తనాలపై ఉక్కుపాతం మోపాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీకి కేబినెట్​ నిర్ణయం తీసుకొంది.

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ.. వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించి, వివిధ విభాగాల్లో వారిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి వీఆర్‌ఏ సంఘాలు, శాఖల అధికారులతో చర్చించాలని.. సర్దుబాటు విధివిధానాలు రూపొందించాలని నవీన్‌ మిత్తల్‌, సీసీఎల్‌ఏకు ఆదేశించింది.

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు.. వనపర్తిలో జర్నలిస్టు భవన్‌ కోసం 10గుంటలు ఇవ్వాలని .. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టు భవన్‌, ఇళ్ల స్థలాల కోసం 23 ఎకరాలు కేటాయింపుకు ఆమోదముద్ర వేశారు. మైనారిటీ కమిషన్‌లో జైన్‌ ప్రతినిధిని కూడా చేర్చాలని నిర్ణయించారు. టీఎస్‌పీఎస్సీలో కొత్తగా పది పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

"తెలంగాణ విజయాలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు.. తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా జరపాలని మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కులవృత్తులకు చేయూత, 111జీవో ఎత్తివేత, వీఆర్‌ఏల క్రమబద్దీకరణ, యాసంగిపంట కాలం మార్పుపై సబ్‌కమిటీ, రెండో విడత గొర్రెల పంపిణీ మొదలగు అంశాలపై మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది". - హరీశ్‌రావు, ఆర్థికశాఖామంత్రి

ఇవీ చదవండి:

Last Updated :May 18, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.