తెలంగాణ

telangana

రాహుల్​పై అనర్హత వేటు.. మధ్యయుగం చక్రవర్తిలా మోదీ తీరు: రేవంత్‌రెడ్డి

By

Published : Mar 24, 2023, 4:21 PM IST

Updated : Mar 24, 2023, 4:49 PM IST

Revanthreddy on Rahul Gandhi Disqualification : అదానీ అంశంపై చర్చ జరగవద్దనే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందన్న ఆయన.. మధ్యయుగం చక్రవర్తిలా మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ఇవాళ నిరుద్యోగ మార్చ్​కు వెళ్లకుండా అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అటవిక చర్యేనన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Revanthreddy
Revanthreddy

Revanthreddy on Rahul Gandhi Disqualification : రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. అదానీ కుంభకోణంపై చర్చ జరుగకుండా ఉండేందుకే రాహుల్ పై వేటు వేశారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని మండిపడ్డారు. సాయంత్రం ఏఐసీసీ ముఖ్య నేతల సమావేశం కానుందని పేర్కొన్న రేవంత్​రెడ్డి.. తాను కూడా జూమ్ వేదికగా పాల్గొంటానని తెలిపారు.

రాహుల్​పై అనర్హత వేటు.. మధ్యయుగం చక్రవర్తిలా మోదీ తీరు: రేవంత్‌రెడ్డి

అనర్హత వేటు వేయడం కక్ష సాధింపు చర్యే : మధ్యయుగం చక్రవర్తిలా మోదీ వ్యవహరిస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్​పై పైకోర్టుకు వెళ్లేందుకు అప్పీల్ చేసుకొనేందుకు 30 రోజుల సమయం ఇచ్చారనీ.. అయినా అనర్హత వేటు వేయడం కక్ష సాధింపు చర్యేనని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో బీజేపీ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగట్టారన్నారు. ముఖ్యంగా అదానీ కుంభకోణంపై ప్రశ్నిస్తున్నందుకే ఈ అనర్హత వేటని రేవంత్​ దుయ్యబట్టారు.

అక్రమ నిర్బంధాలు దుర్మార్గం.. ప్రభుత్వ ఆటవిక చర్య :మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాయం విద్యార్థి ఐకాస చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌కు వెళ్లకుండా తనను, పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడంపై రేవంత్​రెడ్డి మండిపడ్డారు. 50 లక్షలమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఓయూ విద్యార్థులు నడుంబిగించారన్నారు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్‌ పవిత్ర కార్యక్షేత్రం అని పేర్కొన్నారు. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం ఇక్కణ్నుంచే ఊపందుకుందన్న రేవంత్​.. రాజకీయ పార్టీలు విఫలమైన సమయంలో ఓయూ విద్యార్థులే ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తుచేశారు.

ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది : రేవంత్​

పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు నిరసనకు పూనుకున్నారని రేవంత్​రెడ్డి అన్నారు. అక్రమ నిర్బంధాలు దుర్మార్గం, ప్రభుత్వ ఆటవిక చర్యని మండిపడ్డారు. నిరసన దీక్షలకు విద్యార్థులు కాంగ్రెస్‌ను ఆహ్వానించారని పేర్కొన్నారు. అర్హత లేనివారిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా నియమించారని ధ్వజమెత్తారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. లీకేజీలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌పై ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి విచారించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది : నిరుద్యోగ మార్చ్‌కు వెళ్లకుండా రేవంత్‌రెడ్డి సహా అద్దంకి దయాకర్, మల్లు రవి, ఎన్​ఎస్​యూఐ నాయకుల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని రేవంత్‌ ధ్వజమెత్తారు. 30 లక్షల నిరుద్యోగుల పక్షాన వరుస నిరసనలు చేపడతామని రేవంత్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులు యువతకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. వరసగా రెండో రోజూ... గృహ నిర్బంధం చేయడమేంటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని దయాకర్ ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 24, 2023, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details