తెలంగాణ

telangana

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం

By

Published : Jan 29, 2023, 3:59 PM IST

Updated : Jan 29, 2023, 5:42 PM IST

Police
Police

15:43 January 29

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం

TSLPRB on Police Preliminary Results: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలపై పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్‌ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్‌ టికెట్ నంబర్లతో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించారు.

ఈనెల 30 నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దేహదారుడ్య పరీక్ష కోసం పార్ట్‌-2 అప్లికేషన్‌ సబిమిట్‌ చేయాలని పోలీసు నియామక బోర్డు తెలిపింది. ప్రస్తుతం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేసిన వారికి అవసరం లేదని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అవ్వని వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు నియామక బోర్డు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

ఫిబ్రవరి 8 ఉదయం 8గం నుంచి 12వ తేది రాత్రి 10గం వరకూ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని మైదానాల్లో 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రిలిమనరీలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేసిన వారికి అవసరం లేదని తెలిపింది. అయితే ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలో ఎత్తు విషయంలో ఉత్తీర్ణత సాధించని వారి విషయంలో ఎటువంటి తదుపరి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

రాష్ట్రంలో పోలీసు శాఖలో గతేడాది ఏప్రిల్ 25న 554 ఎస్‌ఐ, 15644 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా ఏప్రిల్ 28న 614 ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్​ఫోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిలిమినరీ పరీక్షలో 5లక్షల ఏడు వేల 890 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో పార్ట్ టు అంటే దేహదారుఢ్య పరీక్షల కోసం 4లక్షల 63వేల 970 మంది హాజరయ్యారు. కాగా ప్రిలిమినరీ రాత పరీక్షలో 9 బహుళ సమాధానాల ప్రశ్నల వ్యవహారంలో సిలబస్‌లో లేని కారణంగా రెండు ప్రశ్నలకు మార్కులను కలిపింది. అయితే మిగిలిన ఏడు ప్రశ్నలకు ఆప్షన్లలో రెండు రెండు సమాధానాలు సరైనవి ఉన్నాయి. వీటికి ఏదో ఒక సరైన సమాధానం పెట్టినవారు, ఎటువంటి సమాధానం పెట్టకుండా వదిలేసిన వారికి నిపుణుల కమిటీ సూచనల మేరకు నియామక మండలి మార్కులను కలిపింది. ప్రశ్నలకు రెండు సరైన సమాధానాలు కాకుండా వేరే తప్పు సమాధానాలు పెట్టిన వారికి మాత్రం మార్కులు కలపలేదు. వీటిని తప్పు సమాధానాలుగా పరిగణించింది. అయితే తప్పుడు సమాధానాలకు మైనస్ మార్కులు ఉండటంతో ఈ ఏడు ప్రశ్నల వల్ల పలువురు ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 29, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details