తెలంగాణ

telangana

శ్రీశైలం ప్రాజెక్టుకి తగ్గిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 24, 2020, 10:47 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ten-gates-lifted-in-srisailam-reservoir-to-release-flood-water
శ్రీశైలం ప్రాజెక్టుకి తగ్గిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 2,06,335క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 2,54,761 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 211.47 టీఎంసీలుగా ఉంది.

కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

ఇవీ చదవండి:వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే

ABOUT THE AUTHOR

...view details