తెలంగాణ

telangana

TOP TEN NEWS: టాప్​టెన్​ న్యూస్​ @9PM

By

Published : Feb 23, 2022, 9:00 PM IST

ఇప్పటివరకు వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

  • చివరి రక్తంబొట్టు వరకు..

CM KCR on National Politics: భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిదికాదని హితవు పలికారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని... జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతానని స్పష్టం చేశారు.

  • దేశంలోనే తెలంగాణ టాప్​

Telangana capita power consumption : దేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా 9.2 శాతం తలసరి విద్యుత్ వినియోగం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర అర్ధ గణాంకశాఖ నివేదికలో విడుదల చేసింది.

  • ఆ వివాదాలపై మీ వైఖరేంటి..

Hc On IAS And IPS Allotments: సీఎస్ సోమేష్ కుమార్, ఇంఛార్జి డీజీపీ అంజనీ కుమార్ సహా 13 మంది ఐఏఎస్, ఐపీఎస్​ల కేటాయింపుల వివాదాలపై వైఖరి వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.

ముగిసిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

Gautam Reddy Funeral : గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు.

  • యూపీలో నాలుగో దశ ఎన్నికలు​ ప్రశాంతం

UP Assembly Elections: ఉత్తర్​ ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.45శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దఫా మొత్తం 624 మంది బరిలో నిలవగా.. మార్చి 10న వీరి భవితవ్యం తేలనుంది.

  • అధికార పార్టీ ఎమ్మెల్యే వింత శపథం!

"మా ప్రాంతాన్ని జిల్లాగా చేసేవరకు చెప్పులు, బూట్లు వేసుకోను. అసెంబ్లీలో ఒక్క ప్రశ్న కూడా అడగను.".. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే శపథం ఇది. ఇంతకీ ఎవరాయన?

  • కచోడీ కోసం ట్రైన్​ ఆపిన డ్రైవర్..

Train stops for kachori: రాజస్థాన్​ అల్వార్​కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. కచోడీ కోసం ట్రైన్​ ఆపాడు ఓ లోకో పైలట్​. దావుద్​పుర్​ గేట్​ వద్ద ఈ ఘటన జరిగింది. రైలు ఆపగా.. ఓ వ్యక్తి అక్కడికి వచ్చి డ్రైవర్​కు కచోడీలు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ట్రైన్ మళ్లీ స్టార్ట్​ అయింది. నిబంధనల ప్రకారం.. ఆ క్రాసింగ్​ దగ్గర రైలు ఆపకూడదు. ఇదంతా నిమిషం వ్యవధిలోనే జరిగిపోయినా.. గేట్​ బయట ఎదురుచూస్తున్న వాహనదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఉక్రెయిన్​లో ఎమర్జెన్సీ

Ukraine crisis: సరిహద్దుల్లో రష్యా దూకుడుగా ప్రవర్తిస్తున్న క్రమంలో అప్రమత్తమైంది ఉక్రెయిన్​. ఎలాంటి పరిస్థితులకు భయపడేది లేదని చెప్పిన ఆ దేశం అందుకు తగినట్లుగా సిద్ధమవుతోంది. తాజాగా దేశంలో అత్యవసర పరిస్థితి విధించేందుకు.. ఆ దేశ భద్రతా మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు.. రష్యాపై మరిన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

  • భీమ్లా నాయక్ vs అయ్యప్పనుమ్ కోశియుమ్..

Bheemla nayak movie: పవన్ 'భీమ్లా నాయక్' రిలీజ్​కు రెడీ అయింది. అయితే మలయాళ హిట్​కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాత్రలు, ఒరిజినల్​ పాత్రలు ఎవరెవరు చేశారు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

  • ఐపీఎల్​కు డేట్​ ఫిక్స్

IPL 2022 Venues: ఈసారి ఐపీఎల్​ సీజన్​లో మొత్తం 70 ​మ్యాచ్​లు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 55 లీగ్​ మ్యాచ్​లను ముంబయిలోని మూడు వేడుకల్లోనే నిర్వహించనున్నట్లు సమాచారం. మిగిలిన 15 పుణెలో జరపనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details