ETV Bharat / bharat

యూపీలో నాలుగో దశ ఎన్నికలు​ ప్రశాంతం- 60% పోలింగ్!

author img

By

Published : Feb 23, 2022, 6:01 PM IST

Updated : Feb 23, 2022, 10:14 PM IST

fourth phase of UP Assembly elections
fourth phase of UP Assembly elections

UP Assembly Elections: ఉత్తర్​ ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 9.30 గంటల వరకు 59.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దఫా మొత్తం 624 మంది బరిలో నిలవగా.. మార్చి 10న వీరి భవితవ్యం తేలనుంది.

UP Assembly elections: యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 9.30 గంటల వరకు 59.77 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​​ జరిగింది. ఈ దశలో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 624 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. యూపీ న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్‌ పాఠక్‌ లఖ్‌నవూ కంటోన్మెంట్‌, మరోమంత్రి అశుతోష్‌ టాండన్‌ లఖ్‌నవూ తూర్పు నుంచి పోటీ చేశారు.

fourth phase of UP Assembly elections
ఓటు హక్కు వినియోగించుకున్న లఖ్​నవూ వాసులు
fourth phase of UP Assembly elections
ఓటేసేందుకు వచ్చిన జనం
fourth phase of UP Assembly elections
ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో ఓటేసేందుకు భారీగా తరలివచ్చిన ఓటర్లు

ఓటేసిన ప్రముఖులు..

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. లఖ్​నవూలోని ఓ పోలింగ్​ కేంద్రంలో తన ఓటు వేశారు.

fourth phase of UP Assembly elections
ఓటేసిన అనంతరం వేలును చూపిస్తూ రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

బీఎస్​పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఉదయమే ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే.. లఖ్​నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్​కు చేరుకున్న మాయావతి.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటేశారు.

fourth phase of UP Assembly elections
ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్​పీ అధినేత్రి మాయావతి
fourth phase of UP Assembly elections
లఖ్​నవూలోని ఓ బూలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్​ శర్మ

నిఘాసన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖింపుర్‌ ఖేరీలో భాజపా నేత, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా భారీ భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

లఖింపుర్​ ఖేరీలో 65.54 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ దశలో అత్యధికంగా పీలీభీత్​లో 67.59 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.

fourth phase of UP Assembly elections
భారీ భద్రత మధ్య పోలింగ్​ కేంద్రానికి కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా
fourth phase of UP Assembly elections
ఉన్నావ్​లో ఓటు వేస్తున్న భాజపా ఎంపీ సాక్షి మహారాజ్​

లఖింపుర్​ ఖేరీలోని ఓ పోలింగ్​ బూత్​ వద్ద కేవలం అండర్​వేర్​, మాస్క్​ ధరించి ఓటేసేందుకు వచ్చాడు ఓ యువకుడు. తొలుత మాస్క్​ ధరించకుండా వచ్చిన అనురాగ్​ మౌర్యను ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతించలేదు. దీనికి నిరసనగా ఇంటికి వెళ్లిన మౌర్య.. అండర్​వేర్, మాస్క్​ మాత్రమే ధరించి వచ్చి ఓటేశాడు. ​

fourth phase of UP Assembly elections
అండర్​వేర్​పైనే వచ్చి ఓటేసిన యువకుడు

లఖ్‌నవూ, లఖింపుర్​ ఖేరీ సహా దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్‌ జరిగింది.

ఇప్పుడు పోలింగ్​ జరిగిన 59 స్థానాల్లో.. 2017 ఎన్నికల్లో భాజపా- 51, ఎస్​పీ- 4, బీఎస్​పీ- 3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి. మొత్తం.. ఏడు విడతల్లో యూపీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

ఇవీ చూడండి: ఎన్నికల ప్రచార ఆంక్షల్లో మరిన్ని సడలింపులు.. వాటికి ఈసీ ఓకే

యూపీ ఎన్నికలు.. ఉదయమే ఓటేసిన మాయావతి

Last Updated :Feb 23, 2022, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.