తెలంగాణ

telangana

Telangana Decade Celebrations 2023 : ఊరూవాడా సంబురం.. అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవం

By

Published : Jun 2, 2023, 2:20 PM IST

Formation day of Telangana 2023
Formation day of Telangana 2023

Telangana Formation day Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు మొదటి రోజున ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు.. ఈ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. బీఆర్​ఎస్​ పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.

Decade Celebrations in Telangana Today : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దశాబ్ది సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కలెక్టరేట్లలో మంత్రులు, ప్రభుత్వ విప్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్‌లో మంత్రి గంగుల, జగిత్యాల కలెక్టరేట్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సిరిసిల్లలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్​.. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

"కేసీఆర్​ సారధ్యంలో 9 సంవత్సరాల్లోనే అత్యంత ప్రగతిశీలి రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంది. ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయ, దాని అనుబంధ సంస్థలకు ప్రభుత్వాలు అరకొర నిధులు ఇచ్చేవి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్​ ప్రభుత్వం 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసింది. కొందరు వ్యవసాయం దండగ అన్నా.. కేసీఆర్​ ప్రభుత్వం పండగ చేసింది." - కేటీఆర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

TS Formation Day Celebrations in Nizamabad :నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్​ఎస్​ సర్కార్‌ అభివృద్ధి ప్రస్థాన్నాన్ని వివరించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు.

Telangana Formation day Celebrations in Nalgonda :నల్గొండ కలెక్టరేట్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. సూర్యాపేటలో పోలీస్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ వేడుకలను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిలు ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ దిశానిర్దేశంతో.. పదేళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేశామని మంత్రులు స్పష్టం చేశారు.

Telangana Decade Celebrations in Medak : మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్‌, సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్ అలీ జెండాను ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. సిద్దిపేటలో జరిగి ఆవిర్భావ వేడుకల్లో.. మంత్రి హరీశ్‌రావు పదేళ్లలో బీఆర్​ఎస్​ సర్కార్‌ను తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్​లో అమరవీరులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి జెండా ఆవిష్కరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details