తెలంగాణ

telangana

రెండో రోజూ.. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన

By

Published : Jun 14, 2022, 12:15 PM IST

TS Congress Protest : రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ రెండోరోజు నిరసనలు చేపట్టింది. హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేస్తున్నారు.

TS Congress Protest
రెండో రోజూ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ దీక్ష

TS Congress Protest: హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ రెండో రోజు కూడా నిరసన దీక్ష చేపట్టింది. రాహుల్ గాంధీని రెండో రోజు కూడా విచారణకు పిలిపించడంతో పీసీసీ దీక్షకు పిలుపునిచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్న ఈ నిరసన దీక్షలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొనాలని రేవంత్ పిలుపునిచ్చారు.

ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌, ఖైరతాబాద్‌ నియోజక వర్గ ఇంఛార్జి రోహిన్‌ రెడ్డిలతోపాటు పలువురు ముఖ్య నాయకులు దీక్షలో కూర్చున్నారు.

ABOUT THE AUTHOR

...view details