తెలంగాణ

telangana

'వివేకానంద ఆశయాలు యువత స్పూర్తిగా తీసుకోవాలి'

By

Published : Jan 12, 2021, 7:51 PM IST

గడ్డి అన్నారం డివిజన్​లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి మార్గంలో యువత నడవాలని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు.

Swami Vivekananda Jayanti celebrations
స్వామి వివేకానంద జయంతి వేడుకలు

హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్​లో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద ఆశయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన దేశానికి దక్కిందని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు.

వివేకానంద ఆశయాలను స్పూర్తిగా తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి యువత కృషి చేస్తోందని తెలిపారు. జయంతి వేడుకల్లో నూతన కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ ఈశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి : లక్ష్మణ్​

ABOUT THE AUTHOR

...view details