తెలంగాణ

telangana

మినీపురపోరుపై సర్కారు అభిప్రాయాన్ని కోరిన ఎస్​ఈసీ

By

Published : Apr 20, 2021, 8:57 PM IST

మినీ పురపోరు నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం... ప్రభుత్వ సమ్మతికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సర్కారు అభిప్రాయాన్ని ఎస్​ఈసీ కోరింది.

State election commission
సర్కారు అభిప్రాయాన్ని కోరిన ఎస్​ఈసీ

మినీ పురపోరు నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాల్టీలు సహా ఉపఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీకి విజ్ఞప్తి చేయడంతో పాటు... హైకోర్టును కూడా ఆశ్రయించింది.

విజ్ఞప్తిని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం... ప్రభుత్వ సమ్మతికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

కరోనా ఉద్ధృతి, హైకోర్టు సూచన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల నిర్వహణ విషయంలో సర్కారు నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లనుంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

ABOUT THE AUTHOR

...view details