తెలంగాణ

telangana

SIRPURKAR COMMISSION:సిర్పూర్కర్​ కమిషన్ ప్రశ్నల వర్షం..హైకోర్టును ఆశ్రయించిన ఏసీపీ

By

Published : Oct 26, 2021, 5:18 AM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆ సమయంలో షాద్​నగర్ ఏసీపీగా ఉన్న సురేందర్​ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఆ సమయంలో తాను ఫైరింగ్​ చేయమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కమిషన్​ ముందు వివరించారు.

SIRPURKAR COMMISSION
దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ

దిశా నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో ఆ సమయంలో షాద్​నగర్ ఏసీపీగా ఉన్న సురేందర్​ను సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇచ్చిన వివరాల్లో స్పష్టత కొరవడిందని సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ఎన్​కౌంటర్​కు సంబంధించి సిట్​కు వివరాలు అందించిన సమయంలో తన మానసిక స్థితి బాగా లేదని ఏసీపీ సురేందర్ సిర్పూర్కర్​ కమిషన్​కు తెలిపారు.

ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో షాద్ నగర్ ఏసీపీగా ఉన్న సురేందర్​ను కమిషన్ సుదీర్ఘంగా విచారిస్తోంది. దిశ నిందితులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కొని పారిపోతుండగా కాల్పులు జరిపారని.. ఆ సమయంలో ఫైరింగ్​కు తానేమీ ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని ఏసీపీ సురేందర్ కమిషనర్ వివరించారు.

దిశ నిందితులు పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయారా.. లేకపోతే పోలీసులపై కాల్పులు జరిపిన సమయంలో నిందితులు ఒకరినొకరు కాల్చుకున్నారా అనే విషయం కూడా తనకు తెలియదని సురేందర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ సురేందర్​ను సిర్పూర్కర్ కమిషన్ మంగళవారం కూడా ప్రశ్నించనుంది. అయికే ఈ కమిషన్ విచారణపై ఏసీపీ సురేందర్, నరసింహారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సాక్షులను విచారించిన తర్వాత దర్యాప్తు అధికారుల వాంగ్మూలం నమోదు చేయాలని హైకోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

Sirpurkar Commission: 'వాంగ్మూలం విషయంలో ఎన్​హెచ్​ఆర్సీ బృందం భయపెట్టింది': సురేందర్​

ABOUT THE AUTHOR

...view details