తెలంగాణ

telangana

ఊరెళ్తున్న భాగ్యనగరం - ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 7:12 AM IST

Sankranti Rush Telangana 2024 : సంక్రాంతికి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ​ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు ​ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది.

Sankranthi Festival Effect
Heavy Rush at Bus Stands for Sankranthi Festival

పండగ పూట సొంతూరి బాట- కిక్కిరిసిన బస్టాండ్లు

Sankranti Rush Telangana 2024 :సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్​ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను నడిపుతున్నట్లు ప్రకటించింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి(Mahalakshmi Scheme)- ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్​ఆర్టీసీ(TSRTC) పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

ఉచిత ప్రయాణానికి మహిళలకు కీలక సూచన- ఆ కార్డు చెల్లదంటూ స్పష్టం చేసిన సజ్జనార్

హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్‌స్టేషన్‌లోని కంట్రోల్‌ రూమ్‌లకు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

Sankranti Festival Effect :రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ​ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే తీసుకుంటున్నామని యాజమాన్యం తెలిపింది. ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడంలేదని వెల్లడించింది. మహిళలు ఒరిజినల్ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తమవెంట తీసుకురావాలని సూచించారు. ఉచిత ప్రయాణం చేసే మహిళలు కండక్టర్లకు సహకరించాలని కోరారు.

త్వరలో టీఎస్​ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్​ బస్సులు

మహాలక్ష్మి -ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సుల్లోనూ యధావిధిగా కొనసాగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌, ఆరాంఘర్‌, ఎల్బీ నగర్‌, కేపీహెచ్​బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

"సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ బాగా పెరిగింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులను ఏర్పాటుచేశాము. మహాలక్ష్మి -ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సుల్లోనూ యధావిధిగా కొనసాగుతుంది. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు 4,484 అదనపు బస్సులను నడుపుతున్నాము. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌, ఆరాంఘర్‌, ఎల్బీ నగర్‌, కేపీహెచ్​బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు".- రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ టీఎస్‌ఆర్టీసీ

అలాంటి వారంతా పల్లె వెలుగు బస్సులు ఎక్కండి - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పెషల్​ రిక్వెస్ట్

ABOUT THE AUTHOR

...view details