తెలంగాణ

telangana

నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం - మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 9:33 AM IST

RTC Free Transportation in Telangana : ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ వేగం పెంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీకారంచుట్టింది. అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నారు. మహాలక్ష్మి పేరిట ప్రారంభించే ఆ పథకం ద్వారా మహిళలు, విద్యార్థులేగాక ట్రాన్స్‌జెండర్లకు టికెట్‌ రాయితీ వర్తించనుంది. కొత్త పథకంతో మహిళలకు ఉపశమనం లభించినా ఏటా సంస్థపై రూ.3వేల కోట్ల భారం పడనుంది.

Congress Mahalakshmi Scheme in Telangana
RTC Free Transportation in Telangana

నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

Revanth Reddy Will Launch Mahalakshmi Scheme Today : తెలంగాణవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్​ప్రెస్, నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్సాన్స్‌జెండర్‌లకు ఆర్టీసీ బస్సుల్లోఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒకటిన్నరకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ ప్రాగంణంలో పథకాన్ని ప్రారంభిస్తారని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. రెండు గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు రిజర్వేషన్​, ఉచిత ప్రయాణం!

మహిళలకు వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం : రాష్ట్రంలో నివాసం ఉంటే మహిళలందరికీ వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తించనుంది. రోజు బస్సుల్లో కిలోమీటర్ల మేర ప్రయాణించే విద్యార్థినులకు ఎక్కువస్థాయిలో ఉపశమనం లభించనుంది. ప్రయాణ సమయంలో స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఆ వెంటనే వారికి జీరో టికెట్ మంజూరు చేస్తారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించే వారికి ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులుండవని అధికారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ (RTC MD Sajjanar) వెల్లడించారు.

Congress Mahalakshmi Scheme in Telangana : మహాలక్ష్మీ పథకం అమలుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైందని సజ్జనార్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40,000ల మంది డ్రైవర్లు, కండక్టర్లతో 8వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను డ్రైవర్లు, కండక్టర్లకు వివరించినట్లు సజ్జనార్‌ పేర్కొన్నారు.

ఆ చీటీ ఉంటే హైదరాబాద్​లో 2 గంటలపాటు ఉచిత ప్రయాణం

TSRTC Free Bus Service Women in Telangana :ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున బస్‌స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించనట్లు సజ్జనార్ తెలిపారు. ఉచిత ప్రయాణం అమలులో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. కార్యక్రమం విజయవంతానికి ప్రజలంతా సహకరించాలని పలువురు అధికారులు కోరారు.

మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై చర్చించాం : కొండా సురేఖ

మహాలక్ష్మి పథకం గురించి ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం హర్షణీయమని మహిళలు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఉచితప్రయాణం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో సంస్థకి ఎలాంటి నష్టం ఉండదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు.

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం - ముఖ్యమంత్రిగా ఆరు గ్యారంటీల దస్త్రంపై రేవంత్​ రెడ్డి తొలి సంతకం

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం : విజయశాంతి

ABOUT THE AUTHOR

...view details