తెలంగాణ

telangana

Raging in Gandhi Medical College : గాంధీ మెడికల్​ కాలేజీలో ర్యాగింగ్ రగడ.. ధర్నాకు దిగిన విద్యార్థులు

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 4:00 PM IST

Raging in Gandhi Medical College Students Protest : గాంధీ వైద్యకళాశాలను ర్యాగింగ్ అంశం మరోసారి చుట్టుముట్టింది. జూనియర్లను ర్యాగింగ్ చేశారన్న ఆరోపణలతో​ 10మంది సీనియర్లను సస్పెండ్​ చేసినందుకు.. సmహచర విద్యార్థులు ధర్నాకు దిగారు. సస్పైండైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్​పై మరోసారి పునరాలోచన చేయాలనివైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Gandhi Medical College Ragging Issue
Gandhi Medical College Students Darna

Gandhi Medical College Students Protest: సికింద్రాబాద్‌ గాంధీ వైద్యకళాశాల(Gandhi Medical College)లో ర్యాగింగ్‌ అంశంపై విద్యార్థులు మరోసారి ధర్నాకు దిగారు. అయితే జూనియర్లు కాకుండా సీనియర్లు ధర్నా చేయడం ఇందులో కొసమెరుపు. ఇటీవల కొందరు జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఫిర్యాదులొచ్చాయి. కొత్తగా చేరిన విద్యార్థులను ఈ 10 మంది సీనియర్లు రాత్రిళ్లు తమ హాస్టల్‌ గదులకు పిలిపించి వారం నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. దీనిపై బాధితులు కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీతో దిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌( UGC Anti Ragging Cell)కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం.. అందుకు బాధ్యులైన 10మంది సీనియర్లను సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి నిన్న ఆదేశాలు జారీచేశారు.

Gandhi Medical College Ragging Issue : ఈ ఆదేశాలపై ఇవాళ సీనియర్లు ఆందోళనకు దిగారు. తమ సహచరులపై సస్పెన్షన్ వేటు సరికాదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. సస్పెండ్​ చేసిన పది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని.. కాలేజ్​ ప్రిస్సిపల్​-విద్యార్థుల మధ్య చర్చలు జరిపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకోవాలని.. సస్పెన్షన్​ గురించి మరోసారి ఆలోచించాలని వైద్యవిద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డిని(Medical College Director Ramesh Reddy) విద్యార్థులు కోరారు. తమ తోటి సీనియర్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని.. వారు అసలు ర్యాగింగ్​ చేయలేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

10 Students Suspended in Gandhi Medical College: కానీ అధికారుల అంతర్గత విచారణలో పది మంది సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్లు నిర్థారణ కావడంతోనే వారిని కళాశాల, వసతిగృహం నుంచి సస్పెండ్‌ చేసినట్లు డీఎంఈ తెలిపారు. ఇవాళ సీనియర్ల ధర్నాపై వైద్యారోగ్య శాఖ అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

మరోవైపు గాంధీ వైద్య కళాశాలలో ఓ ప్రొఫెసర్, పీజీ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంపై ప్రాథమిక విచారణ పూర్తైంది. వైద్య విద్య విభాగానికి సంబంధించిన అధికారులు పీజీ విద్యార్థులను, ప్రొఫెసర్‌ను పిలిచి విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించారు. నివేదిక అధారంగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

డబ్బులు ఇస్తేనే ఎక్కువ మార్కులు వేస్తానని సదరు ప్రొఫెసర్ వేధిస్తోందంటూ వాట్సప్‌లో సర్క్యులేట్‌ చేశారు. దీనిపై ఆమె చిలకలగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎనిమిది మంది విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్గత విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని గాంధీ వైద్య కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

'ర్యాగింగ్​ జరగకుండా సీసీ కెమెరాలు అమర్చుకోండి'

ర్యాగింగ్​: 150 మంది జూనియర్లకు ఒకేసారి గుండు

ABOUT THE AUTHOR

...view details