తెలంగాణ

telangana

Ponguleti Jupally Joins Congress : పొంగులేటి, జూపల్లి.. 'చేయి' అందుకున్నట్టేనా..?

By

Published : Jun 7, 2023, 7:29 AM IST

Ponguleti And Jupally To Join Congress Party : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక తర్జనభర్జనలు, చర్చల నడుమ కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... వీరిని బీజేపీలో చేర్పించేందుకు ఆ కమలనాథుల ప్రయత్నాలు కొనసాగూతున్నాయి.

Ponguleti And Jupally To Join Congress Party
Ponguleti And Jupally To Join Congress Party

Ponguleti Jupally To Join Congress :మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలనే విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ... కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం, ఇటు కొల్లాపూర్‌లోని స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇటీవలే వీరిద్దరినీ కలిసి చర్చించినట్లు తెలుస్తోంది.

Ponguleti to Join Congress : కాంగ్రెస్ అధిష్ఠానం కూడాపొంగులేటి, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నట్లు తెలిసింది. చేర్చుకోవడమే కాదు వారికి పార్టీలో తగిన ప్రాధాన్యమివ్వడానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సునీల్ కనుగోలుతో జరిగిన చర్చల్లో.. అభ్యర్థులు, నియోజకవర్గాల అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు టాక్. అయితే గెలుపు గుర్రాలకు మాత్రమే పోటీలో నిలవడానికి అవకాశం ఇచ్చే అంశం గురించి సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అటు నుంచే యూరప్​ వెళ్తారు. ఈనెల 21న తిరిగి ఇండియాకు వస్తారు. ఆయన భారత్​కు వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయ్యే ఆలోచనలో ఉంది టీ కాంగ్రెస్. రాహుల్​తో అన్ని విషయాలు చర్చించిన తర్వాతే చేరిక తేదీని ఖరారు చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Will Ponguleti joins BJP : మరోవైపు బీజేపీ కూడా పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. వారు చేరేందుకు ససేమిరా అన్నప్పటికి కమలదళం తమ ప్రయత్నాలు ఆపడం లేదు. రెండురోజుల క్రితం ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌.. చేరికల కమిటీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఈటల రాజేందర్‌తో చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి పొంగులేటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరికొంత మంది నేతలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Jupally to Join Congress :అలాగే మాజీ మంత్రి, కొల్లాపూర్‌ నుంచి 2018 ఎన్నికలకు ముందు వరుసగా గెలుపొందిన జూపల్లితో పాటు ఆయన అనుచరులు కూడాబీఆర్​ఎస్​కు గుడ్‌బై చెప్పారు. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వంపైన, బీఆర్ఎస్​పైన విమర్శలు గుప్పించారు. కొల్లాపూర్‌లోనూ సమావేశం జరిగింది. వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరడానికి నిర్ణయించుకోగా, వీరితో సన్నిహిత సంబంధాలున్న ఈటల రాజేందర్‌ బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, అక్కడ బీఆర్ఎస్​కు, కాంగ్రెస్‌ ప్రధాన పోటీదారుగా ఉండడడం, బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం తదితర కారణాలతో కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలూ దీనికి దోహదపడ్డాయి..

ఐతే పొంగులేటి, జూపల్లి... కొత్తపార్టీ ఆలోచన కూడా చేశారు. వీటన్నిటిపైనా పలు దఫాలుగా చర్చించుకున్న తర్వాత అటు మరోవైపు కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పొంగులేటి, జూపల్లితో సమావేశమై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సమావేశం తర్వాతే సునీల్‌ బన్సల్‌ ఈటలకు సూచనలిచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details