ETV Bharat / state

Ponguleti joining in congress : కాంగ్రెస్​లో నయా జోష్.. పొంగులేటి, జూపల్లి అటువైపేనా?

author img

By

Published : May 30, 2023, 11:07 AM IST

Ponguleti joining in congress : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్​కు అనుకూలంగా ఉండటంతో హస్తం పార్టీకి రాష్ట్రంలో త్వరలోనే పూర్వవైభవం రానుంది రాజకీయ వర్గాల్లో టాక్. కాంగ్రెస్​లో వచ్చే నెల రెండో వారంలో భారీగా చేరికలుంటాయని పార్టీ నాయకులు చెబుతుండగా.. పొంగులేటి, జూపల్లి చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్సార్​టీపీ కాంగ్రెస్​లో విలీనం దిశగా ముందుకెళ్తున్నట్లు ప్రచారం జోరందుకుంది.

Ponguleti
Ponguleti

Ponguleti joining in congress : కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బీజేపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు.. తమ పార్టీని బలోపేతం చేసేలా ఉన్నాయని కాంగ్రెస్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Jupally joining in congress : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటేనని కాంగ్రెస్​ చేస్తున్న ఆరోపణలు నిజమేనని ప్రజలకు భావిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. తనను కాంగ్రెస్​లోకి రావాలని ఇప్పటికే కొందరు నేతలు ఆహ్వానిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తనకు సోనియా, రాహుల్​పై గౌరవం ఉందని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిగిన ఈటల రాజేందర్​ వారిద్దరు బీజేపీలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు.

Ponguleti and Jupally to Join Congress : ఆ ఇద్దరిని కమలం గూటికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా పలుమార్లు చర్చించగా.. తనకే వారు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు వారిద్దరిని కాంగ్రెస్‌లో చేరకుండా ఆప గలిగానన్నారు. ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ బలంగా ఉందన్న ఈటల.. బీజేపీలో చేరేందుకు వారికి భౌతికంగా ఇబ్బందులున్నాయన్నారు. ఈటల వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మరింత బలం చేసేలా ఉన్నట్లు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉండగా హస్తం నేతలు మాత్రం వాస్తవమే మాట్లాడారని తెలిపారు. అవి తమ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయని కాంగ్రెస్​ శ్రేణులు అంచనా వేస్తున్నారు.

Etela Rajender Comments on T Congress : కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు చొరవ చూపుతున్నా.. మంచిరోజుల కోసం వేచి చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొంగులేటి, జూపల్లి దిల్లీలో.. అగ్రనాయకుల సమక్షంలో హస్తం పార్టీలో చేరతారని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్నాయి. ఐతే రాహుల్‌ గాంధీ.. అమెరికా పర్యటనలో ఉండడం, ఆ పర్యటనకు సమన్వయకర్తగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటిస్తుండటంతో వచ్చే నెల తొలివారంలో చేరికలు ఉండకపోవచ్చని చెబుతున్నారు.

ఈనెల 7న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారత్‌కి తిరిగి వస్తుండటంతో.. 8న ఆ ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి అనుచరుడు మాజీ ఎమ్మెల్యే దయానంద్‌ కాంగ్రెస్‌లో చేరగా అదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కర్ణాటక ఉపముఖ్యమంత్రిని కలిసిన షర్మిల : ఇప్పటికే ఆమె రెండుసార్లు డీకేతో సమావేశం కావడంతో ఆమె కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సాఆర్​టీపీ విలీనమైతే పార్టీకి నష్టమని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా మరికొందరు రెడ్లు, క్రిష్టియన్లు, వై.ఎస్‌ రాజశేఖర్​రెడ్డి అభిమానులు పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందని తద్వారా పార్టీ బలం పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం సులభమవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.