తెలంగాణ

telangana

ఈ నెల 17న వ్యవసాయ వర్సిటీ 5వ స్నాతకోత్సవం

By

Published : Apr 15, 2021, 5:50 PM IST

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం ఈ నెల 17న జరగనుంది. వర్సిటీలోని ఆడిటోరియం వేదికగా ఆన్​లైన్​లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై అధ్యక్షత వహించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో జరగనున్న ఈ స్నాతకోత్సవం.. ప్రాధాన్యత సంతరించుకుంది.

Professor Jayashankar Agricultural University
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఈ నెల 17న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియం వేదికగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు వివరించారు.

నీతి అయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్​చంద్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై, పట్టభద్రులకు పట్టాలు ప్రధానం చేయనున్నారు. స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళసై అధ్యక్షత వహించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒకేసారి.. 21మంది పీహెచ్‌డీ విద్యార్థులు, 148 మంది ఎమ్మెస్సీ విద్యార్థులు, 517 మంది యూజీ విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేయనున్నారు.

దేశంలోనే ఆన్‌లైన్‌లో ఇలా డిగ్రీలు అందజేయడం ఇదే తొలిసారి అని ఉపకులపతి పేర్కొన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరో 10 మంది పీజీ, 10 మంది అండర్ గ్రాడ్యుయేట్​ విద్యార్థులకు బంగారు పథకాలు బహుకరించనున్నామని ప్రకటించారు. కొవిడ్ నేపథ్యంలో జరగనున్న ఈ స్నాతకోత్సవం.. ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:యూనిఫామ్​లో ఉన్న పోలీసుపై దాడి

ABOUT THE AUTHOR

...view details