తెలంగాణ

telangana

Niranjanreddy on Cotton Seeds Shortage : 'పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు'

By

Published : Jun 13, 2023, 3:38 PM IST

Cotton Seeds Shortage in Telangana : రాష్ట్రంలో పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Niranjanreddy on Cotton Seeds Shortage
Niranjanreddy on Cotton Seeds Shortage

Niranjanreddy Warning to Cotton Seed Suppliers: రాష్ట్రంలో పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హెచ్చరించారు. పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై మంత్రి స్పందించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది బోల్‌ గార్డ్‌-2 హైబ్రిడ్ విత్తనాలని.. అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒకే రకమైనవని తెలిపారు. ఇవన్నీ ఉత్పత్తి చేసేది ప్రైవేట్ కంపెనీలేనని స్పష్టం చేశారు.

Niranjanreddy Clarity on Cotton Seeds Shortage in Telangana : ప్యాకెట్ ఒక్కింటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర 450 గ్రాముల ప్యాకెట్‌కు రూ.853 అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. పత్తి విత్తనాల ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమైనా.. ధరల నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరతసృష్టించి.. ఎక్కువ ధరకు మార్కెట్‌లో అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి డీలర్ల లైసెన్సుల రద్దుకు వెనకాడబోమని హెచ్చరించారు. అవసరమైన దాని కన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 65 లక్షల ఎకరాల విస్తీర్ణం భూమిలో పత్తి సాగవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతుల సౌకర్యార్థం.. 58,500 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని, బహిరంగ మార్కెట్‌లో అన్ని కంపెనీల విత్తనాలుకలిపి 77,500 క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పత్తి విత్తనాల లభ్యత విషయంలో రైతాంగం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

'కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి.. ఎక్కువ ధరకు మార్కెట్‌లో అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలి. అలాంటి డీలర్ల లైసెన్సుల రద్దుకూ వెనకాడబోం. అవసరమైన దాని కన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 65 లక్షల ఎకరాల విస్తీర్ణం భూమిలో పత్తి సాగవుతుందని అంచనా వేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం.. 58,500 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయి. బహిరంగ మార్కెట్‌లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉన్నాయి. పత్తి విత్తనాల లభ్యత విషయంలో రైతాంగం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.' - సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details