తెలంగాణ

telangana

Niranjan Reddy Farm Progress Show 2023 : 'ఫార్మ్​ ప్రోగ్రెస్​ షో'కు మంత్రి నిరంజన్​ రెడ్డికి ఆహ్వానం

By

Published : Aug 19, 2023, 1:32 PM IST

Niranjan Reddy Farm Progress Show 2023 : అమెరికాలో ప్రతిష్ఠాత్మక ఫార్మ్​ ప్రోగ్రెస్​ షో-2023కు రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజులు పాటు ఈ వ్యవసాయ ప్రగతి ప్రదర్శన జరగనుంది.

Farm Progress Show 2023
Niranjan Reddy Invited to Farm Progress Show 2023

Niranjan Reddy Farm Progress Show 2023 : రాష్ట్ర ప్రభుత్వం మరో ఘనతను సొంతం చేసుకుంది. వ్యవసాయం రంగంలో ముందున్న తెలంగాణకు అమెరికాలో ప్రతిష్ఠాత్మక "ఫార్మ్ ప్రోగ్రెస్ షో -2023"కు ఆహ్వానం అందింది. ఈ షో ఆహ్వానం మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి(Niranjan reddy) అమెరికా వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి మేరకు ఈ వ్యవసాయ ప్రదర్శనకు హాజరయ్యేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి సిద్ధమయ్యారు.

ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మూడు రోజులపాటు అమెరికా(America) లోని ఇల్లినాయిస్‌ డెకాటూర్‌లో ఈ వ్యవసాయ ప్రగతి ప్రదర్శన(Farm Progress Show 2023) జరగనుంది. ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, రసాయనాలు, యంత్రాలు, పరికరాలు, విత్తన సాంకేతికతలపై ఈ అంతర్జాతీయ ప్రదర్శన వేదిక కానుంది.

Cabinet Sub Committee: 'నవతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించాలి'

Farm Progress Show in America 2023 : తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యం అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పది సంవత్సరాల కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కీలక వ్యవసాయ రంగంలో కూలీల కొరత, నకిలీ విత్తనాలు, పెరుగుతున్న పెట్టుబడులు ప్రధాన సమస్యగా ఉన్న దృష్ట్యా.. అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా మార్చాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. వాటిని అధిగమించేందుకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు, పెట్టుబడులను తగ్గించడం, రైతు పండించిన ఉత్పత్తులకు అధిక ధరలను కలిపించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. అమెరికాలో జరగనున్న ఈ వ్యవసాయ ప్రదర్శన దానికి తోడ్పడుతుందని తాను భావిస్తున్నాని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Cultivation in Telangana 2022 : ఎకరానికి రూ.10 లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగంటే?

Telangana Agriculture Sector Development : గతేడాది కాలంగా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి నిరాదారమైన భూములు.. రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చినట్లు అయింది. ప్రణాళిక శాఖ 2023 నివేదికలో వ్యవసాయ అనుబంధ రంగాలు 18.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ నివేదికలో వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. స్థూల విలువలో వ్యవసాయ వాటా 2014-15లో రూ.76,123 కోట్లు ఉండగా.. అది 2022-23 నాటికి రూ.2,17,877 కోట్లకు చేరింది.

వార్షిక వృద్ధిరేటు జాతీయ సగటు 9.97 శాతాన్ని మించి.. అధికంగా 14.05 శాతంగా నమోదైంది. 2014-15 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం 117 శాతం పెరగగా.. దానికి అదనంగా 74.32 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరనుంది. 2015-16లో 45.7 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా.. 2021-22 నాటికి ఏకంగా 342 శాతం పెరిగి 202.2 లక్షల మెట్రిక్​ టన్నులకు చేరింది.

KTR Tweet on Telangana Agriculture : 'వ్యవసాయం దండుగ అన్నచోటే.. పండుగైంది'

బాగు కోసం సాగు బాట.. కర్షకులకు బోధిస్తూ శిక్షకులుగా..

ABOUT THE AUTHOR

...view details