తెలంగాణ

telangana

పవన్ సినిమాలో విలన్‌గా చేయమని హరీశ్​శంకర్ గంటసేపు బతిమాలాడు: మంత్రి మల్లారెడ్డి

By

Published : Mar 26, 2023, 1:52 PM IST

Minister Mallareddy Interesting Comments : తరచుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో మాట్లాడి యూత్​ను ఉత్తేజపరిచారు. 'మేం ఫేమస్' చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లారెడ్డి.. ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అన్నారు. అదేవిధంగా యువతను ఉద్దేశిస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Minister Mallareddy
Minister Mallareddy

Minister Mallareddy Interesting Comments : ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయని కొనియాడారు. హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కెట్ నిర్మించిన 'మేం ఫేమస్' చిత్ర టీజర్​ను మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు.

కష్టపడితేనే యువత ఫేమస్ అవుతారు : ఈ సందర్భంగా యువత తీరుపై తనదైన శైలిలో స్పందించిన మల్లారెడ్డి.. చిరిగిన జీన్స్ వేసుకొని పబ్‌లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవరని చురకలంటించారు. రెండు పాల క్యాన్లతో జీవితాన్ని ప్రారంభించిన తాను.. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిగా ఫేమస్ అయ్యానని పేర్కొన్నారు. తనకు ఏ సంస్థ నుంచి నిధులు అందడం లేదని.. తన వద్ద బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ బ్యాంక్, యువత బ్యాంక్ ఉందని తెలిపారు. కష్టపడితేనే యువత ఫేమస్ అవుతారని, దేశంలో ఉన్న బిలియనీర్లంతా పాతికేళ్ల కుర్రాళ్లేనని మల్లారెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తా : ఒకప్పుడు తెలంగాణ యువతకు సినిమా అవకాశాలు తక్కువగా ఉండేవని, ఇప్పుడు తెలంగాణ సినిమాల సంఖ్య పెరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన అనంతరం తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని మల్లారెడ్డి వెల్లడించారు. ఇటీవల దర్శకుడు హరీశ్ శంకర్ తన నివాసానికి వచ్చి పవన్ కల్యాణ్ చిత్రంలో విలన్​గా నటించమని కోరారని, అందుకు తాను సున్నితంగా నిరాకరించినట్లు మల్లారెడ్డి వెల్లడించడంతో థియేటర్​లో ఉన్న యువతంతా హీరో మల్లారెడ్డి అంటూ కేరింతలు కొట్టారు.

'చిరిగిన జీన్స్ వేసుకొని అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవ్వలేరు. కష్టపడితే యువత ఫేమస్ అవుతారు. యువత గాలికి తిరగడం మానేసి కష్టపడండి. నేను పాలు అమ్మి కష్టపడి కేసీఆర్ దయతో మంత్రినయ్యా. ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్. కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్​కు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ యువతకు సినిమా అవకాశాలు పెద్దగా లేవు. వచ్చే ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తా. పవన్ కల్యాణ్ సినిమాలో విలన్​గా నటించమని హరీశ్ శంకర్ మా ఇంటికి వచ్చాడు. గంట పాటు బతిమిలాడినా నేను పవన్ కల్యాణ్​కు విలన్​గా చేయనని చెప్పా.' - మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

గంటసేపు బతిమిలాడినా పవన్ సినిమాలో విలన్‌గా చేయనని చెప్పా: మల్లారెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details