తెలంగాణ

telangana

'ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న కేంద్రం.. ఇదే క్లాసిక్ ఉదాహరణ'

By

Published : Feb 1, 2023, 1:10 PM IST

Minister KTR Tweet on PM CARES : మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ట్విటర్ వేదికగా తప్పుబట్టారు. ప్రభుత్వ చిహ్నం, వెబ్‌సైట్‌ని వినియోగిస్తూనే.. పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదు అనడాన్ని కేటీఆర్ సరికాదన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందనటానికి ఇది ఓ క్లాసిక్ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat'కేంద్రం... ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందనడానికి ఇదో క్లాసిక్ ఉదాహరణ'

Minister KTR Tweet on PM CARES మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. ప్రజా సేవలోనూ ముందుంటారు. ప్రజల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పరిష్కరిస్తుంటారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వానికి తనదైన శైలిలో కౌంటర్స్ వేస్తూ ఉంటారు. అయితే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా ఆయన విరుచుకుపడ్డారు.

పీఎం కేర్స్ ఫండ్‌ని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా పేర్కొంటూ కేంద్రం దిల్లీ హైకోర్టుకు ఇచ్చిన సమాచారాన్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. పీఎం కేర్స్ ఫండ్ భారత రాజ్యాంగం, పార్లమెంట్, ఏదైనా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ద్వారా సృష్టించలేదని కేంద్రం దిల్లీ కోర్టుకు తెలిపింది. దీనిపై ట్విటర్ వేదికగా స్ఫందించిన కేటీఆర్.. ప్రభుత్వ చిహ్నం, వెబ్‌సైట్‌ని వినియోగిస్తూనే... పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదు అనడాన్ని తప్పుబట్టారు. ఎన్‌పీఏ సర్కారు... ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందనటానికి ఇది ఓ క్లాసిక్ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది కేటీఆర్‌కు మద్దతుగా కామెంట్స్ చేయగా... మరికొంత మంది కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్‌గా ట్వీట్స్ పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details