తెలంగాణ

telangana

'హైదరాబాద్ ఫార్మా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి'

By

Published : Mar 26, 2022, 6:52 PM IST

KTR US Tour updates: అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రపంచ అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా వారితో మాట్లాడారు.

Minister ktr  talk with pharma companies in us tour
ప్రపంచ అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల అధిపతులతో కేటీఆర్‌ సమావేశం

KTR US Tour updates: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రపంచ అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా ఫైజర్, జెఅండ్ జే, జీఎస్కే వంటి కంపెనీల అధిపతులతో మాట్లాడారు. ఫార్చ్యూన్-500 భాగమైన ఈ కంపెనీల వార్షిక ఆదాయం 170 బిలియన్ డాలర్లు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్‌.... హైదరాబాద్ ఫార్మా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు.

హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. హైదరాబాద్‌లో జీవఔషధ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా సహకారమందించాలని విజ్ఞప్తికి కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. 2023లో జరిగే బయో ఆసియా సదస్సులో పాల్గొనాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ ఆహ్వానించారు.

ఇదీ చదవండి :KTR IN US: దేశానికే గర్వకారణం తెలంగాణ: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details