తెలంగాణ

telangana

KTR Tweet Today : కందికొండ కుమార్తె ట్వీట్‌కు కేటీఆర్ స్పందన

By

Published : Dec 5, 2021, 12:34 PM IST

KTR Tweet Today : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కుటుంబ పరిస్థితి విషయమై... ఆయన కుమార్తె మాతృక రాసిన లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని మరోమారు స్పష్టం చేశారు.

ktr
ktr

KTR on kandikonda's daughter request: గేయ రచయిత కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. తమ కుటుంబ పరిస్థితి వివరిస్తూ సాయం చేయాలని మంత్రి కేటీఆర్​కు.. కందికొండ కుమార్తె మాతృక చేసిన ట్వీట్​పై ఆయన స్పందించారు. గతంలో క్యాన్సర్​తో తీవ్ర అనారోగ్యానికి గురైన కందికొండకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆర్థికపరమైన అవసరాలకు కేటీఆర్ ఆదుకున్నారు.

KTR Tweet Today : క్యాన్సర్ నుంచి కోలుకుని చికిత్స పొందుతున్న కందికొండకు ఇంటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మోతీనగర్​లో ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఒత్తిడి తెస్తుండటంతో కందికొండ కుమార్తె కేటీఆర్​కు లేఖ రాశారు. చిత్రపురి కాలనీలో నివాసం కల్పించాలని కోరారు. మాతృక లేఖపై స్పందించిన కేటీఆర్... కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని, మంత్రి తలసానితో తన కార్యాలయ సిబ్బంది సమన్వయం చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

"డియర్‌ కేటీఆర్‌ సర్‌.. ఈ ఏడాది జూన్‌ నెలలో మా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి మాకు సాయం చేసి, అండగా నిలిచినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్న వెంటిలేటర్‌పై కిమ్స్‌లో ఉన్నప్పుడు మా పరిస్థితి స్వయంగా తెలుసుకుని చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఆర్థికంగానూ అండగా నిలిచారు. దాదాపు 40రోజుల పాటు వైద్యులు నాన్నకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. మీరు స్వయంగా పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైంది. గత నెలలోనూ నాన్న వెన్నెముకకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం ‘మెడికవర్‌’లో చేరితే అప్పుడు కూడా మీ కార్యాలయం వేగంగా స్పందించింది. ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి, శస్త్ర చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చూడాలని మా అమ్మ మంత్రి హరీశ్‌రావును గతంలో కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారిని కలవాల్సిందిగా సూచించారు. 2012 నుంచి నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు సర్జరీలు జరిగాయి. అయినా కూడా చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు కోసం నాన్న రూ.4.05లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ నెల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని ఆదేశించాడు. మా విన్నపాన్ని మన్నించి మాకు చిత్రపురి కాలనీ లేదా, ఇంకెక్కడైనా నివాసం కల్పించండి. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు కూడా తగిన సాయం చేయాలని ఈ సందర్భంగా సవినయంగా కోరుతున్నాం. మానాన్న ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కలలుకనే ‘బంగారు తెలంగాణ’ కోసం తనవంతు రచనలు చేస్తారని ఆశిస్తున్నా’’ .

కందికొండ కుమార్తె మాతృక లేఖ

గతంలో ఆదుకున్న మంత్రి

ktr on kandikonda health : గేయ రచయిత కందికొండ (Kandikonda) చికిత్స కోసం మంత్రి కేటీఆర్‌ (Minister ktr) చేయూత ఇచ్చారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రూ. 2 లక్షల 50 వేల సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి:Kandikonda: కందికొండ చికిత్స కోసం మంత్రి కేటీఆర్ చేయూత

ABOUT THE AUTHOR

...view details