తెలంగాణ

telangana

కూల్​రూఫ్ ఉంటేనే.. అక్యూపెన్సీ సర్టిఫికెట్.. తెలంగాణలో కొత్త రూల్​

By

Published : Apr 3, 2023, 7:52 PM IST

KTR Launch Telangana Cool Roof Policy: కూల్​రూఫ్ పాలసీ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కూల్​రూఫ్ మీటర్‌కు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని.. కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగివస్తుందని వెల్లడించారు. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం.. ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాలపై తగ్గించేందుకు ప్రభుత్వం నూతన పాలసీ తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ కూల్​రూఫ్ విధానం 2023-28 ను కేటీఆర్ ఆవిష్కరించారు.

KTR
KTR

కూల్​రూఫ్ ఉంటేనే.. అక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు: కేటీఆర్‌

KTR Launch Telangana Cool Roof Policy: వేసవిలో పెరుగుతున్న ఎండలతో.. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలోనే చల్లదనం కోసం ఏసీల వాడకం పెరిగుతోంది. తద్వారా కాలుష్య ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఏసీలు అమర్చుకోలేని సామాన్యులు.. వేడిమి వల్ల వడదెబ్బ బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. చలువ పైకప్పులతో భవనాల లోపల.. వేడి తగ్గి, నష్టపోవడంతో పాటు విద్యుత్తు ఆదా అవుతోంది.

ఇందుకోసమే ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.. నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్​, ట్రిపుల్ ఐటీ, జీహెచ్‌ఎంసీలతో కలిసి చలువ భవనాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం 2019లో ముసాయిదాను విడుదల చేంది. వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి తుదిరూపు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ, ఆస్కి కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని.. దేవరకొండ బస్తీలో ప్రయోగాత్మకంగా చలువ నిర్మాణాలను నిర్వహించి పనితీరును పరిశీలించి.. ప్రభుత్వం కూల్ రూఫ్ పాలసీ తీసుకొచ్చింది.

కూల్ రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్: దీన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇది ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఇప్పుడున్న ఇళ్లతో పాటు.. కొత్త ఇండ్లకు కూల్ రూఫ్ అమలు చేయాలని నిర్ణయించింది. కూల్​రూఫ్ టాప్ ముందు.. తన ఇంటికే చేయించినట్లు మంత్రి వెల్లడించారు. రూఫ్‌తో పాటు గోడలకు కూడా పెయింట్ వేస్తే.. ఇంకా చల్లగా ఉంటుందని అన్నారు. దీనిని తప్పనిసరి చేస్తున్నామని.. కూల్​రూఫ్ ఉంటేనే అక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా: హైదరాబాద్‌తో పాటుగా మున్సిపాలిటీలలో దీన్ని అమలు చేయాలని కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణదారులకు వీటిపై అవగాహన కల్పించాలని.. ప్రజలకు అవగాహన కల్పిస్తే 100 శాతం అమలవుతుందన్నారు. కూల్​రూఫ్​లో నిర్మించే పైకప్పు వల్ల.. గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గనున్నాయి. ఆధునిక సాంకేతికతతో పైకప్పులకు ఉపయోగించే సామగ్రిలో కొన్ని మార్పులు చేయడం.. ప్రత్యేక రసాయనాల వినియోగంతో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. చలువ పైకప్పులపై త్వరలోనే మననగరంతో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

"కూల్‌రూఫ్‌ పాలసీ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కార్యక్రమం. దీని వల్ల మీటర్‌కు రూ.300 మాత్రమే ఖర్చు అవుతుంది. కరెంట్‌ బిల్లులు తగ్గే అవకాశం ఉంది . కూల్‌రూఫ్‌ కోసం ముందుకొచ్చేవారికి శిక్షణ అందిస్తాం. త్వరలో మననగరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌ నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

ఇవీ చదవండి:TSPSC పేపర్ లీకేజీ ఎఫెక్ట్‌.. ఆ పరీక్షనూ వాయిదా వేయాలని డిమాండ్

కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి.. రెబల్​గా పోటీకి సై!.. కుమారస్వామి తగ్గేదేలే!

ABOUT THE AUTHOR

...view details