తెలంగాణ

telangana

దావోస్​లో పెట్టుబడుల ప్రవాహం.. రూ.2వేల కోట్లతో ఎయిర్​టెల్ డేటా సెంటర్

By

Published : Jan 18, 2023, 7:41 PM IST

Minister KTR Davos Tour Updates Today

Minister KTR Davos Tour Updates Today: తెలంగాణలో ఎయిర్‌టెల్-ఎన్‌ఎక్స్‌ట్రా డేటా సెంటర్లు పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భారతి ఎయిర్‌టెల్ గ్రూప్ ఎన్‌ ఎక్స్‌ట్రా డేటా సెంటర్‌ల ద్వారా, మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడిగా 2వేల కోట్లు పెడుతున్నట్లు సంస్థ తెలిపింది.

రాష్ట్రానికి మరో రూ.2వేల కోట్లు పెట్టుబడులు

Minister KTR Davos Tour Updates Today: దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎయిర్‌టెల్-ఎన్‌ఎక్స్‌ట్రా డేటా సెంటర్లు పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతి ఎయిర్‌టెల్ గ్రూప్ ఎన్‌ ఎక్స్‌ట్రా డేటా సెంటర్‌ల ద్వారా మౌలిక సదుపాయాల కోసం మూలధన పెట్టుబడిగా 2వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది.

భారతి ఎయిర్‌టెల్ గ్రూప్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు దావోస్‌లోని తెలంగాణ లాంజ్‌లో ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో అమలులోకి వస్తుందని సంస్థ తెలిపింది. ఎన్నో కీలకమైన ప్రాజెక్టులకు ఈ డేటా సెంటర్ సేవలతో ప్రయోజనం కలుగుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మరోవైపు యూరోఫిన్‌ సైంటిఫిక్‌ సంస్థ అత్యాధునిక ప్రయోగశాలను హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో క్యాంపస్‌ను స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 90 వేల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న క్యాంపస్‌ కోసం ఆస్తులు సేకరించినట్లు వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో యూరోఫిన్స్ మేనేజ్‌మెంట్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అనంతరం సంస్థ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహమే సాగిందని డేటా చెబుతోంది. దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ విషయాన్ని అక్కడకు వచ్చిన దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు వివరించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు 36 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఓ విజయవంతమైన స్టార్టప్ స్టేట్ గా తెలంగాణను పరిచయం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక నిర్ణయాలు, టీఎస్ ఐ పాస్ పారిశ్రామిక విధానం అనుమతుల ప్రక్రియతో తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని గుర్తుచేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1000కి పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. నోవార్టిస్, మెడ్ట్రానిక్, బేయర్, సనోఫీ, రోషే, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్ లలో 35% కేవలం తెలంగాణ నుంచే తయారు అవుతున్నాయని... పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను కూడా అనేక కంపెనీలు కలిగి ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఐటీలో ఇప్పటికే గణమనీయమైన పురోగతి సాధించామని.. ఇప్పుడు డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ విభాగాల్లోనూ సత్తా చాటేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేటీఆర్ వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details