తెలంగాణ

telangana

ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గుండు సున్నా అంటూ కేటీఆర్ ట్వీట్​

By

Published : Aug 28, 2022, 12:24 PM IST

KTR tweet on Medical Colleges: వైద్య విద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప చరిత్ర లిఖించారని మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్రం ఎన్ని కాలేజీలు మంజూరు చేసిందో సమాధానం చెప్పాలని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

కేటీఆర్
కేటీఆర్

KTR tweet on Medical Colleges: గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్ని మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఐటీశాఖమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత 67 ఏళ్ల కాలంలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటయ్యాయని తెలిపారు. వైద్య విద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప చరిత్ర లిఖించారని మంత్రి కేటీఆర్ అన్నారు. అధికారంలో వచ్చిన ఎనిమిదేళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రకారం ప్రభుత్వం మరో 13 కళాశాలలు ఏర్పాటు చేయనన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే సంగారెడ్డిలో వైద్య కళాశాల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని ప్రకటించారు. అలాగే, మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాల నిర్మాణం కూడా దాదాపు చివరిదశకు చేరుకుందని తెలిపారు.

ఇక వనపర్తి, రామగుండం, జగిత్యాల వైద్య కళాశాలల నిర్మాణం కూడా దాదాపు పూర్తయినట్లు కేటీఆర్ వెల్లడించారు. నాగర్‌ కర్నూలు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా దాదాపు పూర్తైందని తెలిపారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ వైద్య కళాశాలలు పనిచేయడం ప్రారంభమయ్యాయని అన్నారు. త్వరలో కొత్తగూడెం వైద్య కళాశాల ప్రారంభోత్సవం చేసుకోబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఇవీ చదవండి:ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరద, నిండుకుండల్లా జలాశయాలు

వరదలో కొట్టుకుపోయిన లారీ, మూడు టన్నుల సిమెంట్ గంగపాలు

ABOUT THE AUTHOR

...view details