తెలంగాణ

telangana

వైద్యులు పైరవీలకు రావొద్దు.. 2, 3 ఏళ్లు ఇచ్చిన చోటే పని చేయాలి: హరీశ్​రావు

By

Published : Dec 31, 2022, 4:12 PM IST

Updated : Dec 31, 2022, 7:01 PM IST

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం బలోపేతం కావడమే కాకుండా.. దేశంలో అగ్రగామిగా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్య విద్య, వైద్య సేవల్లో సత్తా చాటుతున్నామని ఆయన వెల్లడించారు. 929 మంది ప్రభుత్వ వైద్యులుగా ఎంపికైన డాక్టర్లకు హరీశ్‌రావు నియామక పత్రాలు అందజేశారు. భవిష్యత్‌లో వైద్య, ఆరోగ్యశాఖలో మరిన్ని నియామకాలు చేపడతామని మంత్రి తెలిపారు.

Minister Harish Rao
Minister Harish Rao

హైదరాబాద్ హైటెక్‌ సిటీ శిల్ప కళా వేదిక.. కొత్తగా నియమితులైన వైద్యుల పరిచయ కార్యక్రమంతో సందడిగా మారింది. 929 మంది ప్రభుత్వ వైద్యులుగా ఎంపికైన డాక్టర్లకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు మంత్రి స్వాగతం పలికారు. "సమాజ సేవకు పంపడంలో తల్లిదండ్రులు, గురువులకు ధన్యవాదాలు తెలియజేశారు. తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తారు. ప్రాణం పోసి శక్తి వైద్యులకు మాత్రమే ఉందని" మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ వైద్యులుగా ఎంపికైన డాక్టర్లు తమ ఆనందాన్ని మంత్రి హరీశ్‌రావు ముందు వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇంత మందికి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వడం మొదటిసారని చెప్పిన హరీశ్‌రావు కొవిడ్‌ వేళ సేవలు అందించిన ఒప్పంద వైద్యులకు 20 శాతం వెయిటేజీ కల్పించి న్యాయం చేశామన్నారు. ఇదే ఒరవడితో ముందుకు వెళ్తూ.. వైద్య రంగంలో దేశం మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే వివిధ విభాగాల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నామని ఆయన వివరించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రేపే కొత్త వైద్యులంతా బాధ్యతల్లో చేరాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. దయచేసి వైద్యులు బదలీల కోసం పైరవీలకు రావద్దని.. కనీసం రెండు, మూడేళ్ల ఇచ్చిన పోస్టింగ్‌లో పనిచేయాలని సున్నితంగా మంత్రి హెచ్చరించారు.

"అందరికీ శుభాకాంక్షలు. నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు స్వాగతం. సమాజ సేవకు పంపడంలో విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులు, గురువులకు ధన్యవాదాలు. తల్లి జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మ ఇస్తారు. ప్రాణం పోసే శక్తి వైద్యులకు మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసిన వైద్యులకు పీజీలో కూడా వెయిటేజీ కల్పించాం. రేపే వైద్యులంతా బాధ్యతల్లో చేరాలి. దయచేసి వైద్యులు బదిలీల కోసం పైరవీలకు రావద్దు. కనీసం రెండు, మూడు ఏళ్లు ఇచ్చిన పోస్టింగ్‌లో పని చేయాలి. బాగా పనిచేసి పేదలకు సేవలందిస్తే కౌన్సిలింగ్‌లో వెయిటేజీ కల్పిస్తాం".- హరీశ్ రావు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి

'వైద్యరంగం బలోపేతంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది'
Last Updated : Dec 31, 2022, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details