తెలంగాణ

telangana

Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు.. రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 11:38 AM IST

Updated : Oct 28, 2023, 12:24 PM IST

Medigadda Barrage Damage Issue
Medigadda Barrage

11:32 October 28

Medigadda Barrage Damage Issue : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం

Medigadda Barrage Issue :మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై తెలంగాణకు కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. ఘటనపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యామ్‌ భద్రత అథారిటీ మరో లేఖ రాసింది. ఆదివారం లోగా వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఈనెల 23 నుంచి 26 వరకుకేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. సందర్శన సమయంలో కొంత సమాచారం ఇచ్చారని కేంద్ర అధికారులు తెలిపారు. కమిటీ తిరుగుపయనానికి ముందే వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాసినట్లు చెప్పారు.

20 అంశాల సమాచారం కోరినట్లు కేంద్ర జలమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చారన్న డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ.. ఒక అంశానికి పాక్షికంగానే సమాచారం ఇచ్చారని పేర్కొంది. రేపటిలోగా అన్ని వివరాలు పంపాలని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు కేంద్ర జలమంత్రిత్వ శాఖ డైరెక్టర్ లేఖ రాశారు.

Medigadda Barrage Damage Issue in Telangana :మరోవైపు ఇటీవలే మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని నీటి పారుదల శాఖ జనరల్​ ఈఎన్​సీ మురళీధరన్​ చెప్పారు. ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అనుమానించారు. ఏడో బ్లాక్​లో సమస్య వల్ల సెంటర్​ పియర్​ కుంగిందని తెలిపారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్వాలిటీ ఆఫ్​ సాండ్​, క్వాలిటీ ఆఫ్​ కన్​స్ట్రక్షన్​ అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. కాఫర్​ డ్యామ్​కు వరద తగ్గాక నవంబర్ చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని ఈఎన్​సీ మురళీధరన్​ వివరించారు.

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ జలాశయాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు.. ప్రాజెక్ట్ వద్దకు విపక్షాలకు నో ఎంట్రీ'

Medigadda Barrage Bridge Sagged Incident :మేడిగడ్డ ఆనకట్ట పియర్ కుంగుబాటులో ఎలాంటి కుట్రకోణం లేదన్న ఈఎన్సీ మురళీధర్.. ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్లే సమస్య వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేదన్నారు. ఆనకట్ట కుంగిన వైపు ఇప్పటికే నీటి ప్రహావాన్ని తగ్గించగా.. పూర్తిగా తగ్గేలా అర్ధచంద్రాకారంలో కాఫర్డ్యామ్ నిర్మించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆనకట్టను మొత్తం ఎనిమిది బ్లాకులుగా విభజించి నిర్మించినందున కేవలం ఒక్క ఏడో బ్లాకుపైనే ప్రభావం ఉంటుందని.. ఇతర బ్లాకులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కొంత మేర తగ్గుతుందని.. అయితే పంపులు ఎత్తిపోసేందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు.

Central Experts Team Inspected Medigadda Barrage :మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. బ్యారేజ్​ని పరిశీలించి.. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలతో పాటు బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేసింది.

ఇదీ జరిగింది :కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్(Medigadda Barrage Damage) వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. రాత్రి సమయంలో భారీ శబ్దంతో బీ బ్లాకులోని పియర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా.. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యామ్ పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజ్​ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు.

Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"

Central Experts Team Inspected Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం.. ఒకట్రెండు రోజుల్లో నివేదిక

Last Updated : Oct 28, 2023, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details