తెలంగాణ

telangana

''చలో కావ‌లి'లో అరెస్ట్​ చేసినవారిని వెంటనే విడుదల చేయాలి'

By

Published : Jan 10, 2023, 10:59 PM IST

Nara Lokesh Fires On AP Police : ఏపీలోని నెల్లూరులో దళితులపై వరుస దాడులను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన 'చలో కావ‌లి' కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారని నారా లోకేశ్ ఆరోపించారు. ''చలో కావ‌లి'' కార్యక్రమాన్ని అణచివేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. దళితులపై దాడులు సైకో పాల‌న‌కు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh Fires On AP Police : ఆంధ్రప్రదేశ్‌లోని కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులకు నిర‌స‌న‌గా తెదేపా ఎస్సీ సెల్ తలపెట్టిన 'చలో కావ‌లి' కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో అణచివేయ‌డాన్ని నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ ఏపీ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజును అరెస్టు చేసిన పోలీసులు ఎటు తీసుకెళ్తున్నారో స‌మాచారం ఇవ్వక‌పోవ‌డం సైకో పాల‌న‌కు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఎంఎస్ రాజుతో పాటు అరెస్ట్ చేసిన ఉద్యమ‌కారులంద‌రిపై బనాయించిన త‌ప్పుడు కేసులు ఉప‌సంహ‌రించుకుని, వారిని తక్షణమే విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోకేశ్​ ట్వీట్​ చేశారు.

వైసీపీ వేధింపులతో పలువురు ఆత్మహత్య: ముసునూరు ప్రాంతానికి చెందిన కరుణాకర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు అధికార పార్టీ నేతలే కారణమని సూసైడ్ నోట్​లో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు హర్ష.. వైసీపీ నేతల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో పొదలకూరుకు చెందిన నారాయణ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.

ఈ ఘటనలను నిరసిస్తూ.. తెలుగుదేశం చలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న చలో కావలి కార్యక్రమానికి హాజరవుతున్న సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ మాలేపాటి సుబ్బనాయుడును అరెస్ట్ చేసి జలదంకి స్టేషన్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details