తెలంగాణ

telangana

thunderbolt : ఇంటిపై పిడుగుపడి రూ.20 లక్షల నగదు, బంగారం దగ్ధం

By

Published : Sep 19, 2021, 4:39 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం సాయంత్రం ఓ ఇంటిపై పిడుగు పడింది. ఘటనలో ఇంట్లో ఉన్న రూ.20లక్షల నగదు సహా.. తమ కుమారుడి చదువు కోసం ఉంచిన రూ.20లక్షల కాలిబూడిదయ్యాయని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇంటిపై పడిన పిడుగు
ఇంటిపై పడిన పిడుగు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంటిపై పిడుగు పడింది. మంటలు వ్యాపించడంతో సుమారు 20 లక్షల నగదు, 50 కాసుల బంగారం దగ్దమైనట్లు బాధితులు తెలిపారు. తమ కుమారుడి చదువుల కోసం ఇటీవల పొలం విక్రయించి 20 లక్షల నగదు ఇంట్లో ఉంచామని.. పిడుగుపాటుతో నగదు మొత్తం మంటల్లో కాలిపోయిందని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇంటిపై పిడుగుపడి రూ.20 లక్షల నగదు, బంగారం దగ్ధం

ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇదీ చూడండి:Accident: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details