తెలంగాణ

telangana

KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్‌'

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 8:12 PM IST

Updated : Sep 21, 2023, 9:12 PM IST

KTR Laid Foundation Eurofins Campus : జినోమ్‌ వ్యాలీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బయో ఫార్మా సర్వీస్ క్యాంపస్‌కు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. దాదాపు రూ.1,000 పెట్టుబడితో దీనిని నిర్మిస్తున్నారు. తద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

KTR
Eurofins company

KTR Laid Foundation Eurofins Campus in Genome Valley :ప్రముఖ ఫార్మా హబ్ జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించనున్నట్టు ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బెల్జియంకి చెందిన యూరోఫిన్స్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బయో ఫార్మా సర్వీస్ క్యాంపస్‌కి మంత్రి భూమిపూజ చేశారు. యూరోఫిన్స్ సంస్థ నగరంలో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఫలితంగా సుమారు 2,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరి ముందున్న సవాలు.. ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని పేర్కొన్నారు. ఇక 15 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న యూరోఫిన్స్ ల్యాబ్‌లో (Eurofins Campus) ప్రపంచ ఫార్మా సంస్థలకు కెమిస్ట్రీ, బయోలజీ, టాక్సికాలజీ, బయో ఎనలిటికల్ సర్వీసెస్ విభాగాల్లో అవసరమైన ఫార్ములేషన్లను యూరోఫిన్స్ రూపొందించనుండటం విశేషం.

దావోస్​లో పెట్టుబడుల ప్రవాహం.. రూ.2వేల కోట్లతో ఎయిర్​టెల్ డేటా సెంటర్

హైదరాబాద్‌ జినోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్ అని.. సంస్థ స్థానిక ఎండీ నీరజ్ గార్గ్ అన్నారు. 15 ఎకరాల స్థలంలో దాదాపు లక్ష చదరపు అడుగులలో ప్రయోగశాల, కార్యాలయం ఉంటుందని చెప్పారు. ఈ క్యాంపస్ ద్వారా ప్రపంచ ఔషధ కంపెనీలకు డిస్కవరీ కెమిస్ట్రీ, డిస్కవరీ బయోలజీ, సేఫ్టీ టాక్సికాలజీ, బయోఅనలిటికల్ సర్వీసెస్, ఫార్ములేషన్ డెవలప్‌మెంట్ సేవలను అందిస్తుందని తెలిపారు.

Tabreed Company to Invest in Telangana : హైదరాబాద్​లో ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్​​ కూలింగ్ సిస్టమ్..పెట్టుబడి విలువ రూ.1600కోట్లు ​

భారత్ యూరోఫిన్స్, యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా ఫార్మాస్యూటికల్, అగ్రోసైన్సెస్ కంపెనీలకు ఆర్‌అండ్‌డీ అవసరాల కోసం సేవలను అందించనుందని సంస్థ స్థానిక ఎండీ నీరజ్ గార్గ్ తెలిపారు. ఈ కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్ భారత్‌లోపెట్టుబడులు పెట్టడానికి జీనోమ్ వ్యాలీలో అనువైన ప్రదేశంగా గుర్తించామని సంస్థ స్థానిక ఎండీ నీరజ్ గార్గ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐసీ ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఫార్మా సంచాలకులు శక్తి ఎం.ఎన్‌.నాగప్పన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

"యూరోఫిన్స్ సంస్థ హైదరాబాద్‌లో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఫలితంగా సుమారు 2,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరి ముందున్న సవాలు.. ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలి." - కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

KTR Laid Foundation Eurofins Campus ఉపాధి ఉద్యోగ కల్పన సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్‌

గుజరాత్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు: కేటీఆర్‌

Foxconn Industry in Telangana : 'ఫాక్స్​కాన్​తో 35 వేల మందికి ఉపాధి'

Last Updated :Sep 21, 2023, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details