ETV Bharat / state

Tabreed Company to Invest in Telangana : హైదరాబాద్​లో ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్​​ కూలింగ్ సిస్టమ్..పెట్టుబడి విలువ రూ.1600కోట్లు ​

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 4:45 PM IST

Tabreed Company to Invest in Telangana : ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్​ కూలింగ్​ సిస్టమ్​ ప్రాజెక్టును హైదరాబాద్​లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో రూ.1600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు దుబాయ్​కు చెందిన తబ్రీద్​ సంస్థ పేర్కొంది. అందులో భాగంగా మంత్రి కేటీఆర్​కు తబ్రీద్​ సంస్థ, రాష్ట్ర అధికారుల మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.

Tabreed
Tabreed Company to Invest in Telangana

Tabreed Company to Invest in Telangana : ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీడ్(Tabreed).. రాష్ట్రంలో తన భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం దాదాపు రూ.1600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మాసిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాలకు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ను తబ్రీడ్ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు తబ్రీడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని(MoU) కుదుర్చుకుంది. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్(KTR Dubai Tour) సమక్షంలో సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్​లో మంత్రి కేటీఆర్​తో ఆ సంస్థ సీఈఓ ఖలీద్​ అల్​ మర్జు, ప్రతినిధి బృందం సమావేశమయ్యారు.

Minister KTR Dubai Tour : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈ అవగాహనా ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పరిస్థితులకు అనుకూలంగా డిస్టిక్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే కూలింగ్ పరిష్కారాలు, కూల్ రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా రాష్ట్రం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు పోతుందని మంత్రి తెలిపారు.

Tabreed company to Invest Rs 1600 Crore in Hyderabad : తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం భారత దేశ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సంస్థ చైర్మన్ ఖాలిద్ అబ్దుల్లా అల్ ఖుబాసి తెలిపారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ రంగంలో ఉన్న అపారమైన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు. హైదరాబాద్​ ఫార్మాసిటీతో పాటు పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు కూలింగ్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ అభివృద్ధి చేయనున్నట్లు తబ్రీద్​ సంస్థ పేర్కొంది.

Tabreed to set Asia Largest Cooling District Project in Hyderabad : ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య రహిత ఫార్మసిటికల్ క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ తో పాటు రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు అవసరమైన అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తమ కూలింగ్ టెక్నాలజీలను అందిస్తామని ఖుబాసి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి కూలింగ్ పరిష్కారాలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా నెట్ జీరో ఉదారాల విషయంలో తెలంగాణ తన లక్ష్యాన్ని అందుకుంటున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పైన ప్రశంసలు కురిపించారు.

KTR at Chicago Food Stop : 'తెలంగాణ ఫుడ్​స్టాప్' తెస్తాం.. షికాగోలో 'ఆహారంలో సృజనాత్మకత'పై ప్రసంగంలో కేటీఆర్

Minister KTR Dubai Tour 2023 : దుబాయ్ పర్యటనలో కేటీఆర్.. తొలిరోజే తెలంగాణకు రూ.1,040 కోట్ల 'అరబ్‌' పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.