తెలంగాణ

telangana

వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని విచారిస్తున్న సీబీఐ అధికారులు

By

Published : Feb 24, 2023, 12:58 PM IST

Updated : Feb 24, 2023, 3:29 PM IST

MP Avinash Reddy attends CBI investigation : వైఎస్ వివేకా హత్యకేసులో మరోసారి సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన ఎంపీ అవినాష్‌ను... సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి
ఎంపీ అవినాష్ రెడ్డి

MP Avinash Reddy attends CBI investigation : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్​రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మరోసారి సీబీఐ విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో ఎంపీ అవినాష్​రెడ్డి సీబీఐ ఆదేశాలతో హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

సీబీఐ ఆదేశాలతో మరోసారి హైదరాబాద్​లోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి ఎంపీ అవినాష్​ను.. సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సునీల్ యాదవ్ బెయిల్​ పిటిషన్​పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ అఫిడవిట్​లో దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను ప్రస్తావించింది. వాటన్నింటిపై వైఎస్ అవినాష్​రెడ్డిని లోతుగా ప్రశ్నించనున్నట్లు సమాచారం.

అటు అవినాష్‌ విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయానికి వైఎస్సార్​సీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. దాంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సీబీఐ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవినాష్ అనుచరులను సీబీఐ కార్యాలయ పరిసరాల నుంచి పోలీసులు పంపించేశారు. గతనెల 28న ఎంపీ అవినాష్‌ను సీబీఐ నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీబీఐ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని వివిధ అంశాలపై లోతుగా ప్రశ్నించనుంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో... కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాశ్‌రెడ్డి హత్య చేయించినట్లు 2021 అక్టోబర్‌లో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోనే విస్పష్టంగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ... ఆ దిశగా లోతైన విచారణ చేసింది. ఈ విచారణలో అవినాశ్‌రెడ్డి పాత్రపై దొరికిన ఆధారాల మేరకు ఆయనకు సంకెళ్లు వేసింది. అవినాశ్‌రెడ్డి అరెస్టు వైఎస్​ఆర్​ జిల్లాతో పాటు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2023, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details