తెలంగాణ

telangana

ICMR DG Balram Bhargava: 'వైద్య ఆవిష్కరణలకు ఇండియా అంతర్జాతీయ కేంద్రంగా మారాలి'

By

Published : Nov 13, 2021, 7:47 PM IST

వైద్య ఆవిష్కరణలకు భారత్​ అంతర్జాతీయ కేంద్రంగా మారాలని ఐసీఎంఆర్ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ(icmr dg Balram bhargava news) ఆకాంక్షించారు. హైదరాబాద్​ ఐఐటీలో నిర్మించిన బీఎంఐ-బీటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. దాదాపు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.

icmr dg Balram bhargava, iit hyderabad news
ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ, ఐఐటీ హైదరాబాద్

వైద్య ఆవిష్కరణలకు భారతదేశం అంతర్జాతీయ కేంద్రంగా మారాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ICMR) డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ(icmr dg Balram bhargava news) అన్నారు. ఐఐటీ హైదరాబాద్ భారతదేశంలో అగ్రగామిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్​ ఐఐటీలో నిర్మించిన బీఎంఐ-బీటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

దాదాపు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించినట్లు ఆయన(icmr dg Balram bhargava news) తెలిపారు. బయోటెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్ విభాగాలు రెండింటికీ ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ రెండు డిపార్ట్​మెంట్ల కార్యకలాపాలను ఆత్మ నిర్భర్ భారత్, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రోత్సహిస్తుందని వివరించారు.

పోస్ట్-గ్రాడ్యుయేట్ & అండర్-గ్రాడ్యుయేట్​లు కోసం ICMR CoEతో తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమాలతో ఐఐటీ హైదరాబాద్ దేశంలో... ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో అగ్రగామిగా ఎదగాలని భావిస్తున్నానని అన్నారు.

ఇదీ చదవండి:KTR: ఆ అధికారులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details