తెలంగాణ

telangana

అభివృద్ధి చూడలేకే ​అనవసరపు విమర్శలు : గుత్తా సుఖేందర్ రెడ్డి

By

Published : Jan 26, 2023, 11:39 AM IST

Updated : Jan 26, 2023, 12:09 PM IST

Gutta Comments on Tamilisai : తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రాలు, నూతన భవనాలను విమర్శించడం బాధ్యతల్లో ఉన్నవారికి గౌరవం కాదని గుత్తా అన్నారు. పలు అంశాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. కళ్లుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించిన ఆయన.. బాధ్యతల్లో ఉన్న కొంత మంది అభివృద్ధిని చూడకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

Gutta Interesting Comments
Gutta Interesting Comments

గవర్నర్​ వ్యాఖ్యలపై గుత్తా కౌంటర్

Gutta Comments on Tamilisai: తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రాలు, నూతన భవనాలను విమర్శించడం బాధ్యతల్లో ఉన్నవారికి గౌరవం కాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పలు అంశాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందన్న గుత్తా.. కళ్లుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారే అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

బాధ్యతల్లో ఉన్న కొంత మంది అభివృద్ధిని చూడకపోవడం విచారకరమని గుత్తా వ్యాఖ్యానించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే జాతీయ రహదారులకు టోల్ చెల్లిస్తూ తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని గుత్తా వివరించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం నూటికి నూరు పాళ్లు సుభిక్షంగా ఉందని.. రాష్ట్రం, ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.

'వ్యవసాయ క్షేత్రాలను విమర్శించడమో, లేకపోతే నూతన భవనాలను విమర్శించడమో బాధ్యతలోని వ్యక్తులకు అది మర్యాదగా ఉండదని విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దేశం యావత్ తెలంగాణ అభివృద్ధిని పొగుడుతోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతోంది. ఇక్కడ అమలవుతున్నటుంటి పలు కార్యాక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుసారిస్తున్నారు. రకరకాలైనటుంటి కార్యక్రమాలను దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు అమలు చేయాలనే ఆలోచనతో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి సంబంధించిన రైతు బంధుని కాపీ చేయటం వాస్తవం కాదా.. అని నేను అడుగుతున్నాను. ఎవరి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడను, కళ్లుండి చూడలేని వాళ్లకు ఏం చేప్పలేం. చెవులుండి వినలేని వాళ్లకూ ఏం చేప్పలేం. ఇదే మా సమాధానం'. -గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్

ఇవీ చదవండి:

Last Updated : Jan 26, 2023, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details