తెలంగాణ

telangana

బాపూజీ నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి: జస్టిస్​ చంద్రయ్య

By

Published : Oct 2, 2020, 4:13 PM IST

అహింసా మార్గంలో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన గొప్ప నేత మహాత్మా గాంధీ అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య పేర్కొన్నారు. గాంధీ, లాల్ ​బహదూల్​ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

Gandhi and lal bahadur Shastri's birth anniversary celebrations at HRC
బాపూజీ నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి: జస్టిస్​ చంద్రయ్య

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్​ ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య గాంధీజీ, శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అహింసా మార్గంలో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన గొప్ప నేత మహాత్మాగాంధీ అని జస్టిస్ చంద్రయ్య పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముడంటూ కొనియాడారు. బాపూజీ నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన సూచించారు.

ఇదీచూడండి: గాంధీ స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details