తెలంగాణ

telangana

'అప్పులకు వడ్డీలు కట్టీకట్టీ అలసిపోయాం - మా కోసం ఎవరూ వెతకొద్దు ప్లీజ్'

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 6:39 PM IST

Family Missing in Malakpet : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమైన ఘటన హైదరబాద్​లోని మలక్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక చావుకు సిద్ధమయ్యామంటూ లేఖ రాసి, ఇంట్లో నుంచి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుమార్తె పోలీసులను ఆశ్రయించారు.

Three Family Members Missing in Malakpet
Malakpet Family Missing Case

Family Missing in Malakpet :హైదరాబాద్ మలక్‌పేటలో ఓ కుటుంబం అదృశ్యమైంది. అప్పుల బాధ తట్టుకోలేక ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్లు ఓ లేఖలో పేర్కొంటూ ఆ కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న వారి కుమార్తె సమీప మలక్​పేట పోలీస్ స్టేషన్​లో మిస్సింగ్ కేసునమోదు చేశారు. అప్పులకు వడ్డీలు కట్టి కట్టి అప్పుల్లో కూరుకుపోయామని, ప్రత్యామ్నాయ మార్గం లేక చావునకు సిద్దమయ్యామని, 'మాకు చావు తప్ప వేరే మార్గం లేదు, క్షమించిండి. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు' అంటూ ఇంట్లో ఓ పేపర్‌పై రాసి పెట్టి ఆ ముగ్గురూ వెళ్లారు. ఇంట్లోనే సెల్‌ఫోన్ వదిలి ఇంటికి తాళం వేసి వెళ్లారు.

Viral Video : నా చావుకు ఆ నలుగురే కారణమంటూ సెల్ఫీ వీడియో.. ఆపై

Three Family Members Missing in Malakpet : వివరాల్లోకి వెళితే మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి సలీమ్‌నగర్‌లో వరాహమూర్తి, దుర్గ దంపతులు నివాసముంటున్నారు.వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి సత్య భైరవ ఉన్నారు. వృత్తి రీత్యా గోల్డ్​స్మిత్ (Goldsmith) పనులు చేస్తుంటారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. తండ్రీకుమారులిద్దరూ మహమ్మద్ ఖాన్ జ్యువెలరీ దుకాణంలో పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరు సుమారు రూ.50 లక్షల వరకు అప్పులు చేశారు. తండ్రీకుమారులిద్దరూ జ్యువెల్లరీ షాపులో పని చేస్తూ, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మరింత అప్పుల్లో కూరుకుపోయారు.

Tamilnadu Woman Missing Case Chased by Mahbubabad Police : తమిళనాడులో తప్పిపోయి.. మహబూబాబాద్​లో ప్రత్యక్షం.. 15 నిమిషాల్లోనే..!

Hyderabad Crime News : అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై వరాహమూర్తి, దుర్గ దంపతులతో పాటు వీరి కుమారుడు సత్యమూర్తి ఈ నెల 20వ తేదీన ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వీరి కుమార్తె చాముండేశ్వరి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆమె తనఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వరాహమూర్తి కుటుంబం ఇంటి నుంచి ఓ ఆటోలో వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో (CC cameras) నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఆ ఆటో కోసం గాలిస్తున్నారు. ఆటో ఆచూకీ లభ్యమైతే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

పదో తరగతి విద్యార్థినిని సజీవదహనం చేసిన దుండగులు- అదే కారణమా?

6 Months Baby Missing at Niloufer Hospital : నీలోఫర్​ ఆసుపత్రిలో ఆరు నెలల బాలుడి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details