ETV Bharat / state

6 Months Baby Missing at Niloufer Hospital : నీలోఫర్​ ఆసుపత్రిలో ఆరు నెలల బాలుడి అదృశ్యం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 6:16 PM IST

Police Action on 6 Months Baby Missing at Niloufer Hospital
6 Months Kid Missing Case in Hyderabad

6 Months Baby Missing at Niloufer Hospital : నీలోఫర్​ ఆసుపత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడు విషయంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని నాంపల్లి సీఐ అభిలాశ్​ వెల్లడించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల అనుమానితురాలిని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు.

6 Months Baby Missing at Niloufer Hospital : నీలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన బాలుడి కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నాంపల్లి పోలీసులతో పాటు.. టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎంజీబీఎస్, ఆరాంఘర్​తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో వెతుకుతున్నారు. ఆర్నెళ్ల చిన్నారి ఫైజల్​ను గుర్తు తెలియని మహిళ గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో నీలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital) నుంచి ఎత్తుకెళ్లింది. వివరాల్లోకి వెళితే..

Six Months Old Baby Missing From Niloufer Hospital : నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం

6 Months Baby Missing Case in Hyderabad : హైదాబాద్​లోని గండిపేట్​లో ఓ ఫామ్ హౌజ్​లో వాచ్​మెన్​గా పని చేస్తున్న సల్మాన్, ఫరీదా దంపతులకు ఇద్దరు కుమారులు. నాలుగేళ్ల వయసున్న పెద్ద కుమారుడు తీవ్ర జ్వరం రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి గురువారం ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. వైద్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఫరీదా తన ఆర్నెళ్ల వయసున్న బాబుతో కలిసి వార్డు బయట కూర్చుంది. ఆ సమయంలో ఆమెతో ఓ మహిళ మాటలు కలిపింది. తాను ఇదే ఆస్పత్రిలో బాబును తీసుకొని చికిత్స కోసం వచ్చినట్లు నమ్మబలికింది.

ఫరీదా తన బాబును(Farida son Missing) వార్డు బయట ఉన్న హాలులో నిద్రపుచ్చి.. భోజనం తీసుకురావడానికి వెళ్లింది. 15 నిమిషాల తర్వాత తిరిగొచ్చే సరికి బాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. తనతో మాట్లాడిన మహిళ కూడా కనిపించకపోవడంతో.. ఆమే తన బాబుని ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకుంది. దీంతో ఆసుపత్రి పక్కన ఉన్న పోలీస్​ స్టేషన్​లో తన బాలుడు అపహరణకు గురయ్యాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే నీలోఫర్ ఆస్పత్రిలోని వార్డుల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిలో కొన్నింటి ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఆ పిల్లవాడు మిస్​ అయిన వార్డు దగ్గరల్లో ఉన్న సీసీ కెమెరా పని చేయకపోవడంతో మహిళను గుర్తించడం కష్టంగా మారిందని నాంపల్లి సీఐ అభిలాశ్​ తెలిపారు. గుర్తు తెలియని మహిళ కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు.

"బాబు తల్లి పక్కన కూర్చున్న గుర్తు తెలియని మహిళ తీసుకు వెళ్లిందని చుట్టుపక్కల వ్యక్తులు చెప్పారు. ఆమె ఆనవాళ్లు సేకరిస్తున్నాం. 5 టీంలుగా ఏర్పడి గాలిస్తున్నాం. రాత్రంతా సీసీ కెమెరాలను పరిశీలించాం. అనుమానితురాలిని తెలుసుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నించాం. సీసీ ఫుటేజ్​ ద్వారా కొంత సమాచారం లభించింది. వాటి ద్వారా మరింత సమాచారం దొరికితే తెలియజేస్తాం. ఈ ఆసుపత్రిలో ఉన్న కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దానివల్ల బాబును పట్టుకోవడం ఆలస్యమౌతోంది. రేపటిలోగా బాబును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం."-అభిలాశ్​, నాంపల్లి సీఐ

6 Months Baby Missing at Niloufer Hospital నీలోఫర్​ ఆసుపత్రిలో ఆరు నెలల బాలుడి అదృశ్యం

Boy died in drainage : బాలుడిని మింగిన ఓపెన్ డ్రైనేజీ.. విజయవాడలో విషాదం

Boy Missing Case : కొడంగల్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

missing: నా కొడుకు ఎక్కడో చోటా ప్రాణాలతో ఉండాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.