ETV Bharat / crime

missing: నా కొడుకు ఎక్కడో చోటా ప్రాణాలతో ఉండాలి

author img

By

Published : Jul 5, 2021, 11:17 AM IST

గొర్రెలను మేపుకుంటూ వెళ్లిన తండ్రితో అడవివైపు అడుగులు వేసిన బాలుడు దారితప్పాడు. స్థానికుల సాయంతో నాలుగురోజులుగా పోలీసులు అడవిని జల్లెడపడుతున్నా ఆచూకీ దొరకలేదు. ఏపీలోని నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో డ్రోన్లకూ బాలుని కదలికలు చిక్కలేదు. గ్రామస్థుల పిలుపు, అరుపులకు ప్రతిస్పందన లేదు. కనీసం ఏడుపూ వినిపించకపోవటంతో బరువెక్కిన గుండెతో తల్లిదండ్రులు, గ్రామస్థులు రోదిస్తున్నారు. ప్రాణాలతో ఉండాలని దేవుళ్లను వేడుకుంటున్నారు.

three-years-boy-missing-at-uyyalapalli
నా కొడుకు ఎక్కడో చోటా ప్రాణాలతో ఉండాలి

నాలుగు రోజులవుతుంది ఆ చిన్నోడు తప్పిపోయి. ఎక్కడికి వెళ్లాడో..ఆకలికి ఏడుస్తున్నాడో! ఏమైందో అని తల్లి ..ఏడుస్తూనే ఉంది. పోలీసులు, గ్రామస్థులు డ్రోన్ల సహాయంతో అడవంతా గాలించినా లాభం లేకుండా పోయింది.

ఏపీలోని నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన గిరిజన దంపతులు బుజ్జయ్య, వరలక్ష్మి రెండో సంతానమైన సంజు.. నాలుగు రోజుల క్రితం అడవిలో తప్పిపోయాడు. ఇంకా మూడేళ్లు నిండని సంజు.. తల్లిదగ్గరే ఆడుకుంటూ ఉండగా తండ్రి.. గొర్రెలు, మేకలను మేపడానికి అడవిలోకి వెళ్లాడు. అది చూసిన సంజు.. మెల్లగా తండ్రి వెళ్లిన దారిలోనే అడుగులు వేశాడు. పనిలో ఉన్న తల్లి ఇది గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత కుమారుని కోసం చూడగా కనిపించలేదు. కంగారుపడ్డ వరలక్ష్మి..చుట్టూ వెతికినా సంజూ జాడ కనిపించ లేదు. అడవి వైపు వెళ్తుండగా చూసిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

వందమంది పోలీసుల గాలింపు..

సంజు తప్పిపోయిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విషయాన్ని పై అధికారులకు ఎస్సై చేరవేశారు. అప్పటి నుంచి ఆదివారం వరకు.. సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ గంగాధర్‌, ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో అడవిని జల్లెడపట్టారు. సుమారు వందమంది పోలీసులు..మరో వందమంది స్థానికుల సహకారంతో అడవి అంతా గాలించారు. రెండు రోజులపాటు డ్రోన్‌ కెమెరాతోనూ పరిశీలించినా బాలుడు దొరకలేదు. బాలుని అడుగుల జాడలూ కనిపించక... పోలీసుల పిలుపులకు స్పందన లేక, కనీసం ఏడుపూ వినిపించకపోవటంతో బాలునికి ఏమైందేమోనని కంగారుపడుతున్నారు. అయినా నిరాశ పడకుండా వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు. మూడేళ్లు కూడా పూర్తికాలేదని.. ఆకలితో ఎంత ఇబ్బందిపడుతున్నాడో అని బాలుని తల్లి తల్లిడిల్లిపోతున్నారు.

ప్రాణాలతో ఉంటే చాలు!

బాలుడు తప్పిపోయాడన్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ.. తమవైపుగా వచ్చి ఉంటాడేమో అనే ఆశతో వెతుకులాటకు సిద్ధమవుతున్నారు. సంజూ ఎక్కడో చోట ప్రాణాలతో ఉండాలని తల్లిదండ్రులు, స్థానికులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.

ఇదీ చూడండి: Dead Bodies : చెరువులో బాలికల మృతదేహాలు.. హత్యా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.