తెలంగాణ

telangana

రుణ యాప్‌ల కేసులో మరో రూ.131 కోట్ల జప్తు

By

Published : Sep 30, 2021, 5:37 PM IST

Updated : Sep 30, 2021, 6:31 PM IST

loan app
loan app

17:33 September 30

LOAN APP case: రుణ యాప్‌ల కేసులో మరో రూ.131 కోట్ల జప్తు

 రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మరో రూ.131 కోట్లను జప్తు చేసింది. క్యాష్‌బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలిచ్చిన పీసీఎఫ్ఎస్... చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పనిచేస్తోందని ఈడీ పేర్కొంది.  

సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్మును ఈడీ జప్తు చేసింది. గతంలో పీసీఎఫ్ఎస్‌కు చెందిన రూ.106 కోట్లను ఈడీ జప్తు చేసింది.  

ఇదీ చూడండి:Loan App Case: రుణ యాప్‌ల కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు

Last Updated :Sep 30, 2021, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details